టేక్‌హోం రేషన్‌కు ఆర్టీసీ కార్గో

- లాక్డౌన్ నేపథ్యంలో పౌష్ఠికాహార పంపిణీకి పటిష్ట కార్యాచరణ
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పోషకాహార సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని ఆరోగ్యలక్ష్మి, బాలామృతం ఆహార పంపిణీ (టేక్‌హోం రేషన్)కి విఘాతం కలుగకుండా రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోనున్నది. రాష్ట్రంలోని 149 ప్రాజెక్టుల పరిధిలోని 35,700 (3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలతో సహ) అంగన్వాడీ కేంద్రాల ద్వారా 7 నెలల నుంచి ఆరేండ్ల వయసున్న 16,31,600 మంది పిల్లలు, 4,39,826 మంది బాలింతలు, గర్భిణులు ఇలా మొత్తం 20,71,426 మందికి ప్రభుత్వం క్రమం తప్పకుండా పోషకాహారం అందిస్తున్నది. లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ ఫుడ్స్ గోదాము నుంచి (బాలామృతం, బాలామృతం ప్లస్), ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి ఇతర వస్తువులను సరఫరా చేయటానికి ఆర్టీసీ కార్గో సేవల్ని విరివిగా వినియోగించుకొంటున్నది. ఈ మేరకు ఆర్టీసీ కార్గో సేవలను మరింత సమర్థంగా వాడుకోవాలని ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యా దేవరాజన్ జిల్లా సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.

పౌష్టికాహార సమస్యతో ఎవరూ ఇబ్బంది పడొద్దు
లాక్డౌన్ కారణంగా ఏ ఆడబిడ్డ, ఏ పసిబిడ్డ పౌష్టికాహార సమస్యతో ఇబ్బంది పడకూడదని అన్ని చర్యలు తీసుకుం టున్నట్టు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లోనే కాకుండా మారుమూ ల ప్రాంతాల్లోని లబ్ధిదారులకు పౌష్ఠికాహారాన్ని చేర్చేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. మొదటి లాక్డౌన్ సమయంలో అంగన్వాడీలు తమ సేవాగుణాన్ని ప్రదర్శిం చి దేశం మనసును గెలుచుకున్నారని, మళ్లీ అదే స్ఫూర్తితో పనిచేయాలని అన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పినపాక మండలం టేకులగూడేనికి చెందిన మినీ అంగన్వాడీ కార్యకర్త చంద్రకళ గత ఏడాది రాష్ట్రపతి అవార్డు పొందిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

