ఈ-కొలి బ్యాక్టీరియాతో క్యాన్సర్..!

- సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకుల వెల్లడి
హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ ): నీరు, జీవావరణంతోపాటు మానవశరీరంలో ఉండే ఈ-కొలి బ్యాక్టీరియాతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. ఈ బ్యాక్టీరియాలో ఉన్న కొన్ని విష జన్యువులు కొలిటాగ్జిన్ను ఉత్పత్తి చేస్తున్నాయని, దాని కారణంగా పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని తెలిపారు. యూవోహెచ్ ప్రొఫెసర్ నియాజ్ అహ్మద్ నేతృత్వంలోని పరిశోధనా బృందం దాదాపు నాలుగువేల జీవకణాలపై పరిశోధన నిర్వహించిన ఈ విషయాన్ని గుర్తించింది. మనుషుల డీఎన్ఏను సైతం మార్చగలిగే కొలిటాగ్జిన్తో చాలామంది క్యాన్సర్ బారినపడినట్టు గుర్తించారు. మనదేశంలో 7 శాతం మంది ఈ-కొలి బ్యాక్టీరియా వల్ల క్యాన్సర్ బారినపడ్డారని, దీనిపై విసృ్తత పరిశోధన జరగాల్సి ఉన్నదని నియాజ్ అహ్మద్ తెలిపారు. జర్మనీకి చెందిన రాబర్ట్ కోచ్ ఇనిస్టిట్యూట్, పుణెలోని డాక్టర్ డీవై పాటిల్ విద్యాపీఠ్ సహకారంతో ఈ పరిశోధన నిర్వహించారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

