Navy Radar | నేవీ రాడార్ పనులను ఆపండి.. 2021లో ఇచ్చిన స్టేటస్కో కొనసాగించండి
Navy Radar | వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో కొనసాగుతున్న వీఎల్ఎఫ్ నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు పనులను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అడ్వకేట్ రాంకల్యాణ్ చల్లా విజ్ఞప్తి చేశారు.
- నరికిన చెట్ల స్థానంలో నాటిన మొక్కల్లో 90% లేనేలేవు
- రిజర్వ్ ఫారెస్ట్‌లో 11 బోర్లు
- రాడార్ పనులపై నిజనిర్ధారణ కమిటీ వేయాలి
- సీజేఐకి అడ్వకేట్ చల్లా వినతి
Navy Radar | వికారాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో కొనసాగుతున్న వీఎల్ఎఫ్ నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు పనులను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అడ్వకేట్ రాంకల్యాణ్ చల్లా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన జూలై 30న సుప్రీంకోర్టులో సీజేను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అడ్వకేట్ రాంకల్యాణ్ చల్లా మాట్లాడుతూ.. దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి 2021లో ఇచ్చిన స్టేటస్కోను కొనసాగించాలని కోరారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుతోపాటు నేవీ అధికారుల నివాసానికి సంబంధించి నరికిన చెట్ల స్థానంలో నాటిన 2,500 మొక్కల్లో 90 శాతం మొక్కలు లేనేలేవని, మొక్కలను పెట్టి వదిలేశారని తెలిపారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో బోర్లు వేయబోమని చెప్పిన నేవీ అధికారులు.. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా 11 బోర్లు వేశారని పేర్కొన్నారు. మరోవైపు నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి 2017లో తుది అనుమతులురాగా, 2020 వరకు రిజర్వ్ ఫారెస్ట్ ప్రమాదంలో పడకుండా 11 లక్షలకుపైగా మొక్కలను నాటాలని ఫారెస్ట్ అధికారులను కోర్టు ఆదేశించి ఏడేండ్లు దాటినా ఇప్పటివరకు అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటేందుకు భూమిని కూడా గుర్తించలేకపోయారనే విషయాన్ని సీజేఐకు విన్నవించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

