‘స్థానిక’ సంకల్పం.. స్వరాష్ట్రంలో సాకారం
- ప్రగతి దారుల్లో పల్లె, పట్నం – సర్వతోముఖాభివృద్ధి దిశగా రాష్ట్రం
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): దశాబ్దాలుగా వెంటాడిన సమస్యలకు తెలంగాణ రాష్ట్రంలో పరిష్కారం దొరికింది. మౌలిక సదుపాయాల కల్పనతో పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 2014 నుంచి గణనీయమైన మార్పులు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రెండుశాఖలకు ప్రాధాన్యమివ్వడంతోపాటు వేలకోట్ల నిధులను కేటాయించారు. కొత్త పంచాయతీలను ఏర్పాటు చేశారు. తండాలను పంచాయతీలుగా మార్చారు.
నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చారు. పురపాలక శాఖలో కొత్త మున్సిపల్ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. అధికారులు, ప్రజాప్రతినిధులను జవాబుదారీ చేశారు. క్షేత్రస్థాయిలో చట్టాలు పకడ్బందీగా అమలవుతున్న ఫలితాలను తెలంగాణ ప్రతి పల్లెలోనూ చూడొచ్చు. పల్లెప్రగతి, పట్టణప్రగతి ద్వారా వేల కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది. అందుకే దేశంలోని ఇతర రాష్ర్టాలకు తెలంగాణ పల్లెలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. జాతీయస్థాయిలో అనేక అవార్డులను సొంతం చేసుకుంటున్నాయి.
పింఛన్లతో ఆసరా
వృద్ధులు, వికలాంగులు, వితంతువులు.. రాష్ట్రంలో అనేక వర్గాలకు అండగా నిలుస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఆసరా పింఛన్లు 2014-15లో 33.90లక్షల మందికి సంవత్సరానికి రూ.1520కోట్లు ఇవ్వగా.. 2022 నాటికి 37.35లక్షల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నారు. ప్రస్తుతం ఏడాదికి రూ.8620కోట్లను ప్రభుత్వం ఖర్చుచేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి కేవలం రూ.200 ఉన్న పింఛను మొత్తాన్ని ప్రస్తుతం రూ.2016కు పెంచారు.
వికలాంగులకు ఎనిమిదేండ్ల క్రితం రూ.1,500 ఇవ్వగా ప్రభుత్వం దాన్ని రెట్టింపు చేసి నెలనెలా ఒక్కొక్కరికి రూ.3016 అందిస్తున్నది. మానవీయ కోణంలో ఆలోచించి సమాజంలో ఉండే ఒంటరి మహిళలకు ఆసరా ఫించను ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడంతోపాటు దానిని విజయవంతంగా అమలు చేస్తున్నారు. వీరితోపాటు బీడీ కార్మికులకు, పైలేరియా బాధితులకు పింఛన్ అందిస్తున్నారు.
వృద్ధి.. ఉపాధి
2014లో 2022లో
ఉపాధి హామీ జాబ్ కార్డులు 54,28,900 61,75,705
ఉపాధి హామీ పనిదినాలు 10.56కోట్లు 14.75కోట్లు
మహిళా స్వయంసహాయక సంఘాలు 3,59,067 4,30,282
స్వయంసహాయక సంఘాల్లో సభ్యులు 32,59,820 46,16,286
మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాలు 3,738.67కోట్లు 2,673.04కోట్లు


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి
డీలర్ షాపు కేటాయింపులో డబ్బుల వసూళ్లు.. అలంపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అక్రమాలపై చర్చ!
Ramayana | 8 రోజుల్లోనే రూ.1,033 కోట్లు.. ‘రామాయణం’ బాక్సాఫీస్ విధ్వంసం, అయినా ఆ రెండు సినిమాల తర్వాతే!
IND vs NZ | సెంచరీతో చెలరేగిన విల్ యంగ్.. భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్
Rajasthan: రాజస్థాన్‌లో 3 రకాల ఓటర్ల జాబితాలు.. సర్‌తో పోలిస్తే ఎస్‌ఎస్‌ఆర్‌లో 11 లక్షల మంది అధిక ఓటర్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

