కోటి టీకాల రక్ష

- కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందంటున్న నిపుణులు
- థర్డ్ వేవ్ వచ్చినా నష్టం కలగకుండా రాష్ట్రం చర్యలు
- 2.2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ లక్ష్యంగా కసరత్తు
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కోటి కొవిడ్ టీకాలు వేయటం ఉపశమనం కలిగించే విషయమని, వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా నిలువరించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని వైద్యారోగ్య నిపుణులు చెప్తున్నారు. 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ చేరేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. రోజుకు సగటున 2 లక్షల వ్యాక్సిన్లు వేయడమే లక్ష్యంగా పని చేస్తున్నది. 2.2 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసే లక్ష్యాన్ని త్వరగా పూర్తిచేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక డోసు తీసుకున్నవారి సంఖ్య 88 లక్షలు కాగా, మరో 14 లక్షల మంది రెండు డోసులు తీసుకున్నారు. అంతర్జాతీయ, జాతీయ ఆరోగ్య సంస్థల ప్రకారం ఒక డోసు తీసుకున్న వారిలోనూ కరోనాను ఎదుర్కొన శక్తి కనీసం 40శాతం దాకా ఉంటుంది. రెండు డోసులు తీసుకున్న వారిలో ఆయా వ్యాక్సిన్ సంస్థలు చెప్పినట్టుగా దాదాపు 80శాతం రక్షణ లభిస్తున్నది.
థర్డ్ వేవ్ వల్ల ఇబ్బంది కావొద్దనే లక్ష్యం
మొదటివేవ్ అనుభవాలతో అమెరికా, కెనడా, బ్రెజిల్, యూకే, జర్మనీలో వ్యాక్సినేషన్ వేగవంతంగా నిర్వహించారు. దీంతో కరోనా మరోవేవ్ విజృంభించలేదు. ఇదేతీరుగా తెలంగాణ ప్రభుత్వం సాధ్యమైనంత తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 26 లక్షలమంది జనసహాయకులకు టీకాలు వేయగా, గత రెండు రోజుల్లో దీన్ని మరింత వేగవంతం చేసింది. ఈ క్యాటగిరీలో మిగిలిపోయిన వ్యక్తులకు కొవిడ్ టీకాలు వేసేందుకు 30 మొబైల్ వాహనాల ద్వారా పని ప్రదేశాల్లోనే టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు, సిబ్బందికి టీకాలను ప్రారంభించింది. మూడో వేవ్ కరోనా వైరస్ వల్ల ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు పెద్ద మొత్తంలో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నది.
హెర్డ్ ఇమ్యూనిటీ వైపుగా..
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం సమూహ రోగనిరోధక శక్తి వ్యాప్తి (హెర్డ్ ఇమ్యూనిటీ) అనేది రెండు రకాలు. ఒకటి సహజంగా వైరస్ వ్యాప్తి వల్ల కలిగేది. రెండోది వ్యాక్సిన్ల వల్ల వృద్ధి చెందేది. కనీసం 60శాతం హెర్డ్ ఇమ్యూనిటీ ఉంటే వైరస్ వ్యాప్తి మందగించడం మొదలువుతందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఇప్పటివరకు కోటి మందికి వ్యాక్సినేషన్ పూర్తి కాగా, 6.19 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. ఈ రెండు విభాగాలకు తోడు వైరస్ వచ్చి ఎలాంటి లక్షణాలు లేకుండా కోలుకున్నవారు పెద్దసంఖ్యలో ఉంటారని అంచనా. ఈ మూడు విభాగాలను పరిశీలిస్తే తెలంగాణ హెర్డ్ ఇమ్యూనిటీ తొలి దశకు చేరుకొనే సమయం చేరువలో ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వ్యాక్సిన్ లక్ష్యం పూర్తయితే హెర్డ్ ఇమ్యూనిటీ వృద్ధి మరింత పెరిగి వైరస్ వ్యాప్తి తగ్గిపోతుందని భావిస్తున్నారు.
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వివరాలు
క్యాటగిరీ తొలి డోసు రెండో డోసు
హెల్త్ కేర్ వర్కర్లు 29,9823 20,8115
ఫ్రంట్ లైన్ వారియర్స్ 30,9151 13,4114
18-44 వయస్కులు 34,25,942 29,715
45 ఏండ్లు పైబడినవారు 48,12,964 11,04,496
మొత్తం 88,47,880 14,76,440
ఒక్కరోజే 2.45 లక్షల మందికి టీకాలు
రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 2.45 లక్షల మందికి వ్యాక్సిన్లు వేసినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. 2.05 లక్షల మంది ప్రభుత్వ కేంద్రాల్లో, 40 వేల మంది ప్రైవేటు కేంద్రాల్లో వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఆదివారం తెలిపింది. 1,103 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ నిర్వహించినట్టు వెల్లడించింది. వ్యాక్సిన్లు పొందుతున్నవారిలో 18 ఏండ్ల పైబడినవారు, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వారియర్లు, ఇతర వర్గాలవారు ఉన్నట్టు తెలిపింది. వ్యాక్సిన్ వృథా కేవలం 0.11 శాతం ఉందని పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- 3rd wave
- corona
- Vaccination
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

