సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ 296 కోట్లు
సింగరేణి కార్మికులకు యాజమాన్యం తీపికబురు అందించింది. దీపావళికి ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.76,500 బోనస్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కార్మికులకు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నెల 21న రూ.296 కోట్లను కార్మికులకు దీపావళి బోనస్‌గా చెల్లించనున్నట్టు సీఎండీ ప్రకటించారు
- గనుల్లో పండుగ ధమాకా
- ఒకరికి గరిష్ఠంగా 76,500
- 21న కార్మికుల ఖాతాల్లో జమ
- సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్

హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులకు యాజమాన్యం తీపికబురు అందించింది. దీపావళికి ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.76,500 బోనస్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కార్మికులకు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నెల 21న రూ.296 కోట్లను కార్మికులకు దీపావళి బోనస్‌గా చెల్లించనున్నట్టు సీఎండీ ప్రకటించారు. కార్మికుల సంక్షేమమే సింగరేణికి తొలి ప్రాధాన్యమని తెలిపారు. గతేడాది ఉత్పత్తి లక్ష్యసాధనలో గణనీయమైన వృద్ధి సాధించామని, ఇందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలతో లాభాల్లో 30 శాతం వాటాను (రూ.368 కోట్లు) దసరా బోనస్‌గా అందించామని గుర్తుచేశారు.
దసరా, దీపావళికి కలిపి ఒక్కో కార్మికుడికి సుమారు రూ.1.65 లక్షలు అం దాయని వివరించారు. ఈ సొమ్ము ను కార్మికులు కుటుంబసంక్షేమం కోసం పొదుపు చేసుకోవాలని సూచించారు. కష్టపడి పనిచేస్తే ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించవచ్చని, తద్వారా సింగరేణికి, కార్మికుని కుటుంబానికి మేలు జరుగుతుందని చెప్పారు. ఇదే స్ఫూ ర్తితో ఈ ఏడాది సైతం ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. దేశంలో తెలంగాణలో మాత్రమే లాభాల వాటా బోనస్‌ను కార్మికులకు చెల్లిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు సింగరేణి కార్మికుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

