రైతుల ధర్నాతో దిగివచ్చిన సర్కార్
రైతుల ఆందోళనతో దిగివచ్చిన సర్కార్ ధాన్యం కొనుగోళ్లకు ముందుకొచ్చింది. మూడు రోజులుగా రైస్‌మిల్లు చుట్టూ తిరిగినా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో విసుగుచెందిన రైతులు శనివారం నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలోని కడంపల్లి గేటు సమీపంలో కోస్గి-మద్దూర్ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు.
- ఎట్టకేలకు కొనుగోళ్లు ప్రారంభం
- రైస్‌మిల్లు వద్ద రైతులకు భోజనం ఏర్పాట్లు
- ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన
కోస్గి, మే 26 : రైతుల ఆందోళనతో దిగివచ్చిన సర్కార్ ధాన్యం కొనుగోళ్లకు ముందుకొచ్చింది. మూడు రోజులుగా రైస్‌మిల్లు చుట్టూ తిరిగినా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో విసుగుచెందిన రైతులు శనివారం నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలోని కడంపల్లి గేటు సమీపంలో కోస్గి-మద్దూర్ రహదారిపై రైతులు ధర్నా కు దిగారు. మూడు, నాలుగు రోజుల నుంచి ధనలక్ష్మి రైస్‌మిల్ చుట్టూ తిరుగుతున్నా.. టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని పలువురు రైతులు ధ్వజమెత్తారు. దాదాపు 30 నుంచి 40 వరకు ట్రాక్టర్లు, ఆటోలు ఇతర వాహనాల్లో గ్రామాల నుంచి రైతులు ధాన్యం విక్రయించేందుకు తీసుకొచ్చినా కొనుగోలు చేయక పడిగాపులు కాయాల్సి వస్తుందని, తినేందుకు తిండి, తాగేందుకు నీళ్లు లేక గోసపడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల ఆందోళనను ‘నమస్తే తెలంగాణ’లో ఆదివారం ‘ధాన్యం కొనక వాత’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీం తో ఎట్టకేలకు రైస్‌మిల్లు యజమానులు దిగివచ్చారు. ఆదివారం ఉదయం నుంచే రైతుల వడ్లను కొనుగోలును మొదలుపెట్టారు. కాగా రైతులకు అల్పాహారంగా ఉగ్గాని, మధ్యాహ్నం అన్నం, చికెన్ కర్రీ వడ్డించారు. పలుమార్లు స్వయంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నం వడ్డించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

