Staff Nurse Recruitment | రేపటి నుంచి జనవరి 6 వరకు స్టాఫ్‌నర్స్ సర్టిఫికెట్ వెరిఫికేషన్
స్టాఫ్‌నర్స్ ఉద్యోగాల నియామకానికి ఈ నెల 30 నుంచి వచ్చే నెల 6 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) తెలిపింది. హైదరాబాద్ బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీ ప్రాంగణంలో ఈ వెరిఫికేషన్ కొనసాగనున్నదని వెల్లడించింది.
Staff Nurse Recruitment | హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): స్టాఫ్‌నర్స్ ఉద్యోగాల నియామకానికి ఈ నెల 30 నుంచి వచ్చే నెల 6 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) తెలిపింది. హైదరాబాద్ బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీ ప్రాంగణంలో ఈ వెరిఫికేషన్ కొనసాగనున్నదని వెల్లడించింది. ఇందుకు తగి న ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నది. 1 : 1.25 పద్ధతిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తామని స్పష్టంచేసింది.
ఈ మేరకు ప్రొవిజినల్ లిస్టును విడుద ల చేశామని, అభ్యర్థులకు సమాచారం కూడా ఇచ్చామని తెలిపింది. అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రాకపోయినా, కావాల్సిన పత్రాల్లో ఏవైనా సమర్పించకపోయినా వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని స్పష్టంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 5,204 స్టాఫ్‌నర్స్ పోస్టులకు ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 30న నోటిఫికేషన్ జారీ చేసింది. వైద్యారోగ్య శాఖ మంత్రి దా మోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు మరో 1,890 పోస్టులను ప్రభుత్వం జత చేసింది. దీంతో మొత్తం పోస్టులు 7,094కు పెరిగాయి. ఈ నెల 18న ఫలితాలు విడుదల చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

