ఏప్రిల్ 10న సీతారాముల కల్యాణ మహోత్సవం
భద్రాద్రి కొత్తగూడెం : ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భద్రాద్రి రామాలయంలో విశేష పూజలు ప్రారంభమయ్యాయి. ఇవాళ సీతారాములను వధూవరులను చేసే వేడుకను నిర్వహించనున్నారు. లక్ష్మణ సమేత సీతారాములకు డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించనున్నారు. ఉత్సవం సందర్భంగా ఇవాళ నిత్య కల్యాణాన్ని, మూలమూర్తులకు స్వర్ణ కవచ అలంకరణ నిలిపివేశారు. ఇవాళ మూలమూర్తులకు విశేస స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 9న సీతారాములకు ఎదుర్కోలు మహోత్సవం, ఏప్రిల్ 10న సీతారాముల కల్యాణ మహోత్సవం, 11న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఆలయ ప్రధాన అర్చకుడు పవిత్ర పుణ్య జలాలను గోటి తలంబ్రాలపై చల్లుతారు. రోలు, రోకలిలో లక్ష్మి, సరస్వతి అమ్మవార్లను ఆవాహన చేసి రోకలికి కంకణధారణ చేస్తారు. తొమ్మిది మంది ముత్తయిదువలు పసుపు కొమ్ములు దంచుతారు. స్వామివారిపై బుక్కా, గులాల్, అత్తరు, పన్నీరు చల్లుతారు. పసుపు, కుంకుమతోపాటు ఇతర ద్రవ్యాలు కలిపి 1,108 మంది మహిళలు తలంబ్రాలను కలుపుతారు. దీంతో రామయ్య పెండ్లి పనులు మొదలైనట్టు పరిగణిస్తారు. అనంతరం అర్చకులు వసంతుడిని ఆవాహన చేసి తొమ్మిది పసుపు ముద్దలను సిద్ధం చేస్తారు. మంత్రాలను జపిస్తూ వసంతాన్ని ప్రోక్షిస్తారు. పసుపు ముద్దల్లో ఒక ముద్దను రామయ్య శిరస్సుపై, రెండోది అమ్మవారి మంగళసూత్రం వద్ద, మూడో ముద్దను లక్ష్మణస్వామి వారిపై ఉంచుతారు. అప్పటి నుంచి సీతారాములు పెండ్లికొడుకు, పెండ్లి కుమార్తెగా భావిస్తారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి గోటి తలంబ్రాలు తెచ్చిన భక్తులు ఆలయ అధికారులకు అందజేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

