దుర్భిక్షంలో సర్కార్ బాధ్యతారాహిత్యం
రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులుంటే, ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. మంగళవారం తెలంగాణభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎల్ నినోను సాకుగా చూపిస్తూ రైతులను పంటలు వేయొద్దంటూ ‘క్రాప్ హాలిడే’ ప్రకటించడం శోచనీయమని మండిపడ్డారు. సాగు, తాగు నీటికి ప్రజలు, రైతులు అల్లాడుతుంటే పాలనను గాలికొదిలేసి మంత్రులంతా ఢిల్లీ చుట్టూ చకర్లు కొడుతున్నారని ధ్వజమెత్తారు.
- తాగు, సాగునీటి కోసంఅల్లాడుతున్న రైతాంగం
- ఎల్ నినోను సాకుగాచూపి క్రాప్ హాలిడేనా?
- తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి: శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులుంటే, ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. మంగళవారం తెలంగాణభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎల్ నినోను సాకుగా చూపిస్తూ రైతులను పంటలు వేయొద్దంటూ ‘క్రాప్ హాలిడే’ ప్రకటించడం శోచనీయమని మండిపడ్డారు. సాగు, తాగు నీటికి ప్రజలు, రైతులు అల్లాడుతుంటే పాలనను గాలికొదిలేసి మంత్రులంతా ఢిల్లీ చుట్టూ చకర్లు కొడుతున్నారని ధ్వజమెత్తారు.
మంత్రులకు భూము లు, పైరవీలు, దందాలపై ఉన్న శ్రద్ధ పరిపాలనపై లేదని శ్రీనివాస్‌గౌడ్ దుయ్యబట్టారు. ఎల్ నినో ప్రభావం పొరుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నప్పటికీ, వారు ముందుచూపుతో ప్రాజెక్టుల్లో నీటిని ఒడిసిపట్టుకున్నారని గుర్తుచేశారు. కృష్ణానది నుంచి సుమారు 350 టీఎంసీల నీరు దిగువకు తరలిపోయినా, రేవంత్ ప్రభుత్వం కనీసం 30 టీఎంసీల నీటిని కూడా నిల్వ చేసుకోలేకపోయిందని మండిపడ్డారు.
శ్రీశైలంలో నీటి నిల్వ 185 టీఎంసీల నుంచి 70 టీఎంసీలకు పడిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. సుమారు 60 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ, మోటర్లను ఆన్ చేయకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆల్మట్టిలో 132 టీఎంసీలు, నారాయణపూర్‌లో 33 టీఎంసీలు ఉండగా, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నీటిని నిల్వ చేసుకుంటుంటే, రేవంత్ సర్కార్ మాత్రం రైతులను నిండా ముంచుతున్నదని ఆరోపించారు.
నీళ్ల బిందెలతో రోడ్డుపైకి మహిళలు
గ్రామాల్లో తాగునీటి కోసం బిందెలతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన దుస్థితి దాపురించిందని శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు రెండో పంట సాగు చేయొద్ద ని చెప్పిన పాలకులు.. మరి వారి జీవనోపాధికి ఎలాంటి భరోసా కల్పిస్తారని ప్రశ్నించారు. క్రాప్‌హాలిడే ప్రకటించడం సమస్యకు పరిషారం కాదని, పంటలు వేయలేకపోయిన అన్నదాతలకు, పంట నష్టపోయిన రైతులకు త క్షణమే పూర్తిస్థాయి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలను కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
అనారోగ్యంలో వైద్య, ఆరోగ్య రంగం
రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగం పూర్తిగా కుదేలైందని శ్రీనివాస్‌గౌడ్ వి మర్శించారు. ప్రభుత్వం బకాయిలు చె ల్లించకపోవడంతో దవాఖానల్లో హెల్త్ కార్డులు చెల్లక ఉద్యోగులు, రిటైర్డ్ ఉ ద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నార ని ఆందోళన వ్యక్తంచేశారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతోపాటు జర్నలిస్టులు, పోలీసులు, హోంగార్డులకు ఆరోగ్య భద్రత కల్పించాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

