భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
సీతారాముల కల్యాణం | భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణ వేడుక కమనీయంగా సాగింది

భద్రాచలం : భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణ వేడుక కమనీయంగా సాగింది. సరిగ్గా పన్నెండు గంటలకు జిలకర్ర, బెల్లం పెట్టారు. అనంతరం మాంగళ్యధారణ జరిగింది. ఈ కమనీయ వేడుక రామ భక్తుల్ని ఆనంద పారవశ్యంలో ముంచెత్తింది. రాములోరి కల్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు సమర్పించారు. కరోనా మహమ్మారి వల్ల భక్తజనుల సందడి లేకుండానే కల్యాణ వేడుకలను నిర్వహించారు. ఇవాళ కల్యాణం ముగియడంతో రేపు శ్రీరామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం జరగనుంది. కొవిడ్ కారణంగా పూజలు, తీర్థ ప్రసాదాలు నిలిపివేశారు.

ఈ వేడుకల్లో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య దంపతులు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎస్పీ సునీల్ దత్, జేసీ కర్నాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని, ఎండోమెంట్ కమీషనర్ అనీల్ కుమార్ దంపతులు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు, సరస్వతి ఉపాసకులు డైవజ్ఞశర్మతో పాటు పలువురు పాల్గొన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

