జాబితా నుంచి 32,214 ఓటర్లు తొలగింపు!
రాష్ట్రంలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా అనర్హుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 32,214 మందిని తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించనున్నారు. మరో పదిహేను రోజుల్లో విచారణ దశ పూర్తికానున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 9,092 మంది అనర్హులుగా తేలింది.
- ‘సర్’తో పలు జిల్లాల్లో అనర్హుల గుర్తింపు
- రంగారెడ్డిలో అత్యధికంగా 9,092 మంది
- తర్వాత స్థానాల్లో పెద్దపల్లి, వరంగల్, హైదరాబాద్
- నవంబర్ 5తో నోటీసులు, అభ్యంతరాల స్వీకరణ పూర్తి
- అనర్హుల సంఖ్య పెరిగే అవకాశం
- 9న తుది ఓటర్ల జాబితా ప్రకటన
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా అనర్హుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 32,214 మందిని తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించనున్నారు. మరో పదిహేను రోజుల్లో విచారణ దశ పూర్తికానున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 9,092 మంది అనర్హులుగా తేలింది.
తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయ సమాచారం ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలో 7,778 మంది ఓటర్లు ఎన్యుమరేషన్ ఫామ్‌లో 2002 ‘సర్’ జాబితాతో తమ పేర్లను మ్యాపింగ్ చేసుకోలేకపోయారు. విచారణ (హియరింగ్) సమయంలో తుది ఓటరు జాబితాలో తమ పేర్ల చేర్పునకు సరైన ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించలేకపోయారు. రాష్ట్రంలోనే అత్యధికంగా తొలగింపునకు గురవుతున్న అన్ మ్యాప్డ్ ఓటర్లు ఉన్న జిల్లాగా రంగారెడ్డి నిలిచింది.
మరో 1,314 మంది ఓటర్లు సమర్పించిన ఫామ్‌లలో తారిక లోపాలు (లాజికల్ డిస్రిపెన్సీస్) ఉన్నప్పటికీ, వాటిని సరిదిద్దుకోవడంలో విఫలమయ్యారు. రంగారెడ్డి తర్వాత స్థానంలో పెద్దపల్లి జిల్లా నిలిచింది. ఇకడ 4,447 మంది ఓటర్లు అనర్హులుగా తేలగా.. వీరిలో 3,140 మంది ఎన్యుమరేషన్ ఫామ్‌లలో తారిక లోపాలను కలిగి ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక తారిక లోపాలు ఉన్న ఓటర్లుగల జిల్లాగా పెద్దపల్లి రికార్డుకెకింది.
ఏఎస్‌డీడీ క్యాటగిరీలో 73,39,235 మంది..
‘సర్’ ప్రక్రియ ప్రారంభానికి ముందు తెలంగాణలో 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా వారిలో 2,64,87,213 మంది ఎన్యుమరేషన్ ఫామ్‌లను సమర్పించారు. మిగిలిన 73,39,235 మంది గైర్హాజరు, వలస వెళ్లినవారు, మరణించినవారు, డూప్లికేట్ (ఏఎస్‌డీడీ) క్యాటగిరీలో నమోదై ఉన్నారు. ఎన్నికల సంఘం ఇప్పటివరకు తారిక లోపాలు, 2002 ‘సర్’ మ్యాపింగ్ లేని 92,88,188 మంది ఓటర్లకు నోటీసులు జనరేట్ చేసింది. వీరిలో 92,68,311 మందికి నోటీసులు అందాయి. మరో 19,877 నోటీసుల అందజేత పెండింగ్‌లో ఉన్నది. గురువారం నాటికి 90,22,264 నోటీసులకు సంబంధించిన విచారణ పూర్తయింది. నవంబర్ 5తో నోటీసులు జారీ చేయడం, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిషార ప్రక్రియ ముగియనుండగా, నవంబర్ 9న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు.
‘సర్’ ప్రక్రియకు సంబంధించిన కీలక గణాంకాలు
రాష్ట్రంలో మొత్తం అనర్హులైన ఓటర్లు : 32,214
రెండోస్థానంలో ఉన్న జిల్లా పెద్దపల్లి : 4,447
అత్యధిక అనర్హులున్న జిల్లా రంగారెడ్డి : 9,092
వరంగల్ జిల్లాలో అనర్హులు : 1,629
హైదరాబాద్ జిల్లాలో అనర్హులు : 1,067
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

