అసంఘటిత కార్మికులకు ప్రత్యేక పథకాలు
- రాష్ట్రంలో కనీస వేతన చట్టం సమర్థంగా అమలు
- టీఎస్ఎస్ఎస్బీయూడబ్ల్యూ కార్యదర్శి గంగాధర్

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): అసంఘటిత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సోషల్ సెక్యూరిటీ బోర్డు ఫర్ అనార్గనైజ్డ్ వర్కర్స్ (టీఎస్ఎస్ఎస్బీయూడబ్ల్యూ) కృషి చేస్తున్నదని ఆ బోర్డు కార్యదర్శి ఈ గంగాధర్ పేర్కొన్నారు. అసంఘటిత కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేయడంలో భాగంగానే ప్రభుత్వం దూరదృష్టితో ఈ బోర్డును ఏర్పాటు చేసిందని తెలిపారు. మార్చి 13న ప్రారంభమైన ఈ బోర్డు ఇప్పటికే రెండుసార్లు సమావేశమై విధి విధానాలను రూపొందించిందని చెప్పారు. వాటి ద్వారా కలిగే ప్రయోజనాలను ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
అసంఘటిత కార్మికులంటే..
వివిధ రంగాల్లో పనిచేస్తూ ఈఎస్ఐ, పీఎఫ్, పెన్షన్ పథకాలతోపాటు ఉద్యోగ, సామాజిక భద్రత లేనివారంతా అసంఘటితరంగ కార్మికులే. డొమెస్టిక్ వర్కర్లు, అడ్డా కూలీ లు ఇలా 127 విభాగాల్లో పనిచేసే వారంతా ఈ కోవలోకే వస్తారు. అసంఘటిత కార్మికులకు ప్రత్యేక పథకాలను అమలు చేయడం, ఏదైనా ప్రమాదం జరిగితే వారికి, వారి కుటుంబానికి ఆర్థిక చేయూతనందించడం టీఎస్ఎస్ఎస్బీయూడబ్ల్యూ ముఖ్య ఉద్దేశం.
ఆన్లైన్లో నమోదు ప్రక్రియ
రాష్ట్రంలోని మొత్తం అసంఘటిత కార్మికుల్లో వ్యవసాయ రంగానికి చెందినవారు 50 శాతం వరకు ఉన్నారు. వీరి వివరాలను nduw.gov.in/eshram.gov.in పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 60 ఏండ్లలోపు వారంతా ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను అందజేసి మీ-సేవ, సీఎస్ సీ సెంటర్లలో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
వారంలో 15.50 లక్షల మంది నమోదు
వివిధ విభాగాల ద్వారా గత వారం రోజుల్లోనే 15.50 లక్షల మంది అసంఘటిత కార్మికుల పేర్లను నమోదు చేయగలిగాం. టీఎస్ఎస్ఎస్బీయూడబ్ల్యూ ద్వారా అసంఘటిత కార్మికులకు కల్పించే ప్రయోజనాలు, ఇతర అంశాల గురించి కార్మిక శాఖలోని విభాగాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. మరోవైపు పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్ మీడియా ద్వారా అసంఘటిత కార్మికులకు అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం.
1.10 కోట్ల మంది సంక్షేమానికి చర్యలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలవున్నాయి. ప్రజల్లో అవగాహన కూడా పెరిగింది. బాలకార్మిక వ్యవస్థను సాధ్యమైనంత వరకు నియంత్రించగలిగాం. మన రాష్ట్రంలో కనీస వేతన చట్టం సమర్థంగా అమలవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల్లో 92 శాతం (1.10 కోట్ల) మంది అసంఘటిత కార్మికులే ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

