ఆదివాసీ తెగల ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ

హైదరాబాద్ : అంతరించిపోతున్న ఆదివాసీ తెగల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వారికి ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా అదనపు పోషకాహారాన్ని అందించేందుకు గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
రానున్న ఆర్థిక సంవత్సరానికి సీఎం కేసిఆర్ ఈ రెండు శాఖలకు గత ఏడాది కంటే ఎక్కువ నిధులు కేటాయించిన నేపథ్యంలో.. ప్రభుత్వ లక్ష్యాలకనుగుణంగా వాటిని సద్వినియోగం చేయడంపై నేడు హైదరాబాద్, దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా జడ్ చోంగ్తు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య, గిరిజన గురుకులాల సంస్థ కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులతో సమీక్ష చేశారు.
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ముఖ్యమంత్రి కేసిఆర్ మానస పుత్రిక అయిన ఆరోగ్య లక్ష్మి పథకానికి ఈ బడ్జెట్ లో ఏకంగా వంద శాతం నిధులు పెంచడం ద్వారా మహిళల ఆరోగ్యానికి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజెప్పారన్నారు.
అయితే గిరిజన గూడాలు, ఆదివాసీ పెంటలు, లంబాడి తండాలలో ఉంటున్న వివిధ తెగలు ముఖ్యంగా అంతరించిపోతున్న ఆదివాసీ తెగల్లో పోషకాహార లోపంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.
ఇందుకోసం ఆరోగ్య లక్ష్మి పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
ఇక కోవిడ్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కొనసాగుతున్న ఇంటింటికి రేషన్ మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు.
గిరిజన శాఖకు కూడా భారీ ఎత్తున బడ్జెట్ పెంచడం వల్ల ఈసారి గిరిజన యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఒకేషనల్ కోర్సులు పెట్టాలన్నారు. ఇందులో ముఖ్యంగా మార్కెట్ డిమాండ్ ఉండి, జీవనోపాధికి చేయుతనిచ్చే విధంగా కోర్సులను డిజైన్ చేసి అమలు చేయాలన్నారు.
గిరిజన ఆత్మగౌరవ ప్రతీకలుగా భావించే గిరిజన భవన్ ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. రోడ్డు వసతులు లేని ఏవైనా గిరిజన ఆవాసాలు ఉంటే వెంటనే వాటికి రోడ్లు వేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి, సమర్పించాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

