GM Arunkumar | త్వరితగతిన ట్రాక్‌ను సిద్ధం చేయాలి.. కేసముద్రం సెక్షన్ పనులను పరిశీలించిన జీఎం అరుణ్‌కుమార్ జైన్
GM Arunkumar | వర్షాలకు దెబ్బతిన్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె సెక్షన్లో ట్రాక్‌ను సిద్ధం చేయాలని సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ ఆదేశించారు. కేసముద్రం, ఇంటికన్నె వద్ద జరుగుతున్న ట్రాక్ మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు.
GM Arunkumar | వర్షాలకు దెబ్బతిన్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె సెక్షన్లో ట్రాక్‌ను సిద్ధం చేయాలని సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ ఆదేశించారు. కేసముద్రం, ఇంటికన్నె వద్ద జరుగుతున్న ట్రాక్ మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేసముద్రం సెక్షన్‌లోని 418-432 కిలోమీటర్ల మధ్య వరద పొంగడంతో ఆదివారం ట్రాక్ దెబ్బతిన్నది. సోమవారం క్షేత్రస్థాయిలో ఆయన మరమ్మతు పనులను సమీక్షించి.. సిబ్బందికి సూచనలు చేశారు. వీలైనంత త్వరగా ట్రాక్‌ని వినియోగంలోకి తీసుకురావాలన్నారు. సెక్షన్ పరిధిలో ఐదు ప్రాంతాల్లో ట్రాక్‌కు నష్టం జరిగింది. ఇందులో నాలుగు ప్రాంతాలకు మరమ్మతులు చేయగా.. చివరగా ప్రధానంగా దెబ్బతిన్న ప్రాంతంలో పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టాలని.. ట్రాక్‌ను రెడీ చేసి రాకపోకలు ప్రారంభించాలని సూచించారు. ఆయన వెంట ఎస్సీఆర్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీ మిశ్రా, చీఫ్ ఇంజినీర్ ఎస్ బ్రహ్మానందం, ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ వివేకానంద్ ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

