త్వరలో డిజిటల్ యూనివర్సిటీలు
పట్టణ ప్రాంతాలకే పరిమితమైన డిజిటల్ విద్యా బోధన ఇకపై గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించనుంది. ఇందుకోసం జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని కన్సార్షియం ఫర్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ (సీఈసీ) డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్భూషణ్ నడ్డా తెలిపారు. త్వరలోనే జాతీయ స్థాయిలో డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు జోరందుకున్నాయని చెప్పారు.
- లోక్‌సభ ఎన్నికల తర్వాత అందుబాటులోకి
- ఇకపై గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటల్ విద్య
- సీఈసీ డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ భూషణ్ నడ్డా వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ): పట్టణ ప్రాంతాలకే పరిమితమైన డిజిటల్ విద్యా బోధన ఇకపై గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించనుంది. ఇందుకోసం జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని కన్సార్షియం ఫర్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ (సీఈసీ) డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్భూషణ్ నడ్డా తెలిపారు. త్వరలోనే జాతీయ స్థాయిలో డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు జోరందుకున్నాయని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత డిజిటల్ యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. వీలైతే వచ్చే విద్యా సంవత్సరం నుంచే డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి కేంద్రం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు.
ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషన్ మీడియా రిసెర్చ్ సెంటర్ (ఈఎంఆర్సీ) ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమైన రెండు రోజుల జాతీయ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరుగనున్న ఈ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జాతీయ స్థాయిలో విద్యార్థుల నమోదు నిష్పత్తి 27.1 శాతం వరకు ఉన్నదని, దానిని 2035 నాటికి 50 శాతానికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం చర్యలు చేపట్టిందని తెలిపారు. అందులో భాగంగా ప్రస్తుతం తరగతి గదిలో జరుగుతున్న బోధనా విధానానికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు (మూక్స్), స్వయమ్ వంటి వేదికల ద్వారా డిజిటల్ విద్యను అందిస్తున్నామని చెప్పారు.
మూక్స్ విధానంలో కోర్సులు
డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటైతే దాని ద్వారా నేరుగా తరగతులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే మూక్స్ విధానంలో కోర్సులు, డిజిటల్ పాఠాలు అందుబాటులోకి తీసుకస్తామని చెప్పారు. ఇప్పటికే యూజీసీ నిబంధనల ప్రకారం అండర్ గ్రాడ్యుయేషన్, పొస్టు గ్రాడ్యుయేషన్ వంటి కోర్సులకు సంబంధించిన పాఠాలను డిజిటలైజేషన్ చేశామని అన్నారు.
ఈ పాఠాలు ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియంలో అందుబాటులో ఉన్నాయని, వాటిని దేశవ్యాప్తంగా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేసే పనులు ఈఎంఆర్సీల ద్వారా ఊపందుకున్నాయని తెలిపారు. డిజిటల్ యూనివర్సిటీల ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చే కోర్సులకు యూజీసీ గుర్తింపు ఉంటుందని అన్నారు. తొలుత కొన్ని డిప్లొమా కోర్సులతోపాటు ఆర్ట్స్‌కు సంబంధించి కోర్సులను ప్రవేశపెడతామని తెలిపారు. ఇంజినీరింగ్ వంటి కోర్సుల్లో ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రముఖ ఇన్స్టిట్యూషన్ల ద్వారా ఆన్లైన్ విద్యా బోధన జరగుతుందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

