అమీర్‌పేట, ఏప్రిల్ 21: ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ గ్రూపుకు చెందిన ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) పథకం కింద 50 మంది చిన్నారులకు ఉచితంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించనున్నాయి.
ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను ప్రముఖ నటుడు సోనూసూద్, ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూపెన్ గురువారం విడుదల చేశారు. కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు అవసరమైన నిరుపేద చిన్నారుల కుటుంబాలు 8113078000, 9656000601 వాట్సప్ నంబర్లను సంప్రదించాలని ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ వర్గాలు తెలిపాయి.