విద్యార్థిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనయుడి దాష్టీకం!
Bandi Sai Bhageerath
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తనయుడు బండి సాయి భగీరథ్ ఓ విద్యార్థిని చావబాదాడు. ఈ ఘటనలో విద్యార్థి తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన నగరంలోని మహీంద్రా యూనివర్సిటీలో చోటు చేసుకున్నది. ఇదే యూనివర్సిటీలో చదువుతున్న బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ ర్యాగింగ్ పేరుతో విద్యార్థిని తీవ్రంగా కొట్టి గాయపడిచారు. రాయలేనివిధంగా నానా భూతులు తిడుతూ విద్యార్థిని సాయి భగీరథ్‌తో పాటు అతని స్నేహితులు కలిసి చితకబాదుతూ, ప్రాంతంతో పేరుతో దూషించాడు.
ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడం వీడియోలో కనిపిస్తున్నది. పైగా మంత్రికి చెప్పినా నన్నేం పీకలేరంటు రంకెలు వేయడం వీడియోలో చూడొచ్చు. విద్యార్థిని తీవ్రంగా కొడుతూ, దుర్భాషలాడుతూ ఈ ఘటన మొత్తం వీడియో తీయడం చూస్తే.. తన తండ్రి అండ చూసుకొని తనను ఎవరూ ఏం చేయలేరన్న లెక్కలేని తనం కనిపిస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
ఆది నుంచి వివాదాస్పదుడిగా పేరున్న బండి సంజయ్ తనయుడు గతంలోనూ ఢిల్లీలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో చదువుతూ ఇలాగే గొడవలకు దిగడంతో సంస్థ నుంచి యాజమాన్యం గెంటివేసింది. తాజాగా నగరంలోని మహీంద్రా యూనివర్సిటీలోని విద్యార్థిని చావబాదాడు. ప్రతిపక్ష నేత బండి సంజయ్ కొడుకు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిపై దాడి చేయడంతో పాటు చంపుతామని బెదిరించిన బండి సాయి భగీరథ్‌పై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహీంద్రా యూనివర్సిటీ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

