నవాబ్‌పేట, సెప్టెంబర్ 27 : జులాయిగా తిరుగుతున్నావని మందలించినందుకు తం డ్రినే చంపిన ఘటన మహబూబ్‌నగర్ జిల్ల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై నరేందర్ కథనం ప్రకారం.. నవాబ్‌పేట మండలం దేపల్లి గ్రామానికి చెందిన రాపోలు రాములు(55) కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. రాములు చిన్న కొడుకు సురేందర్ పనీపాట లేకుండా మద్యం సేవిస్తూ జులాయిగా తిరిగేవాడు. ఈ విషయమై తండ్రి రాములు.. నిలదీయడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సురేందర్ తండ్రిపై బండరాయితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం సురేందర్ తన అన్న శ్రీకాంత్‌కు విషయాన్ని చెప్పి.. గ్రామం నుంచి పరారయ్యాడు. సీఐ గాంధీనాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై నరేందర్ వెల్లడించారు.