డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్‌గా సోమా భరత్‌కుమార్
Soma Bharath Kumar | తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా సోమా భరత్‌కుమార్ నియామకమయ్యారు. భరత్‌ను సీఎం కేసీఆర్ నియమించగా.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు పదవిలో
హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా సోమా భరత్‌కుమార్ నియామకమయ్యారు. భరత్‌ను సీఎం కేసీఆర్ నియమించగా.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. భరత్ నియామక ఉత్తర్వును సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సోమవారం ప్రగతి భవన్లో అందుకున్నారు. డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్‌గా నియమించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా.. సోమా భరత్‌కుమార్ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు.
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడుస్తున్నారు. ఆయన స్వస్థలం సూర్యాపేట జిల్లా వర్ధమానుకోట. వైశ్య సామాజిక వర్గానికి చెందిన సోమా భరత్‌కుమార్ వృత్యిరీత్యా అడ్వకేట్. సీనియర్ అడ్వకేట్‌గా సేవలందిస్తూనే.. ప్రజాస్వామిక స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అప్పగించిన బాధ్యతలను నిర్వహించడడంతో పాటు పార్టీ వ్యవహారాల్లోనూ కీలక సేవలందించారు. ఆయన సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్‌గా నియమించారు. ఆయన నియామకంపై తెలంగాణ వాదులు హర్షం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

