హైదరాబాద్/సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): దక్షిణ తెలంగాణ విద్యు త్తు పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)కు ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) సోలా ర్ రూఫ్ టాప్ ఎనర్జీ (ఈపీఎస్/రెస్కో) విజేత (సిల్వర్) క్యాటగిరీలో అవార్డు లభించింది. ఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడో గ్రీన్ ఊర్జా అవార్డ్స్ అండ్ కాన్ఫరెన్స్లో ఈ అవార్డును ఎస్పీడీసీఎల్ ప్రతినిధికి అందజేశారు. బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి సంస్థలపై భారం పడకుండా, నష్టాలు తగ్గించేందుకు వినియోగదారులను సౌర విద్యుత్తు వైపు ప్రోత్సహించేందుకు సంస్థ చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది. సంస్థ కార్మికులు, ఉద్యోగులు, డైరెక్టర్లు, అధికారులను ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అభినందించారు.