సాఫ్ట్వేర్ అప్డేట్తో ‘ఉపాధి’కి గండి!
గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాల్సిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (వీబీజీరామ్‌జీ) సాఫ్ట్వేర్ చికుల్లో పడింది.
- ఒకరోజులో 5.42 లక్షల మందికి పని
- ఆ మరుసటి రోజే 1.69 లక్షలకు పతనం
- వీబీజీ రామ్‌జీ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్య
- హాజరు పడకపోతే కూలీలకు డబ్బులిచ్చేదెవరు?
- రెండు రోజుల్లోనే సగానికిపైగా తగ్గిన హాజరు
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాల్సిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (వీబీజీరామ్‌జీ) సాఫ్ట్వేర్ చికుల్లో పడింది. కూలీలకు పని కల్పించాల్సిన అధికార యంత్రాంగం సాంకేతిక సమస్యతో చేతులెత్తేసింది. ఒకే రోజులో ఐదున్నర లక్షల మందికి చేరువైన కూలీల హాజరు.. ఆ తర్వాత రెండు రోజుల్లో రెండు లక్షల లోపునకు పడిపోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉపాధి హామీ చరిత్రలోనే నవంబర్ 6న రికార్డు స్థాయిలో 5,42,577 మంది కూలీలు పనులకు హాజరైనట్టు గణాంకాలు వెల్లడించగా.. నవంబర్ 7న ఆ సంఖ్య 1,69,586కు, 9న మరింత తగ్గి 1,43,984కు పడిపోయింది.
అంటే ఒక రోజులోనే దాదాపు 3.73 లక్షల మంది తగ్గినట్టు రికార్డుల్లో కనిపిస్తున్నది. రెండు రోజుల్లోనే కూలీల హాజరు దాదాపు 73% పడిపోయింది. ఇందుకు కారణం పనులు లేకపోవడం కాదని, వీబీజీ రామ్‌జీ సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల కూలీల హాజరు నమోదులో సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు చెప్తున్నారు. నిజంగా సాఫ్ట్వేర్ సమస్యే కారణమైతే పనులకు వచ్చిన కూలీల హాజరు ఎందుకు నమో దు కావడం లేదు? వారి శ్రమకు సంబంధించిన రికార్డులు ఎవరు నిర్వహిస్తారు? హాజరు నమోదుకాకపోతే వారికి కూలి ఎలా అందుతుంది? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రామాల్లో దెబ్బతిన్న ఉపాధి
వీబీజీ రామ్‌జీ సాఫ్ట్వేర్ వెర్షన్ 1.1 నుంచి ప్రస్తుతం 5.10 వరకు చేరినట్టు తెలుస్తున్నది. సాఫ్ట్వేర్ అనేది పాలనను సులభతరం చేసేలా ఉండాలి. కానీ, అదే వ్యవస్థ పేదలకు ఉపాధి దూరం చేసే సాధనంగా మారితే దాని ప్రయోజనం ఏమిటి? ప్రతి అప్డేట్ వల్ల కూలీల హాజరు నమోదులో సమస్యలు తలెత్తుతున్నాయా? ముందస్తు పరీక్షలు నిర్వహించకుండానే కొత్త వెర్షన్లను అమల్లోకి తెస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో తీవ్ర వర్షాభావం, వ్యవసాయ పనులు లేకపోవడంతో ఇప్పటికే గ్రామీణ ప్రజల ఉపాధి దెబ్బతిన్నది.
ఈ పరిస్థితుల్లో ఉపాధి హామీ పనులకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి సమయంలో పనుల కల్పనను పెంచాల్సిన అధికార యంత్రాంగం సాఫ్ట్వేర్ అప్డేట్ పేరుతో తమకు ఉపాధిని దూరం చేయకుండా ప్రత్యామ్నాయ హాజరు నమోదు విధానాన్ని అందుబాటులోకి తేవాలని కూలీలకు కోరుతున్నారు. సాంకేతిక సమస్య పరిషారమయ్యే వరకు మాన్యువల్ రికార్డులను పరిగణనలోకి తీసుకుని కూలి చెల్లింపులకు భరోసా కల్పించాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

