సైన్స్ తోనే సామాజిక అభివృద్ధి : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | విద్యార్థులను శాస్త్ర, సాంకేతికత పరిజ్ఞానం వైపు ఆకర్షితులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ : విద్యార్థులను శాస్త్ర, సాంకేతికత పరిజ్ఞానం వైపు ఆకర్షితులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అరణ్య భవన్లో మంగళవారం మంత్రి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సాంకేతిక మండలి (టీఎస్ కాస్ట్) కార్యనిర్వాహక సమావేశం జరిగింది. విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంపొందించేందుకు టీఎస్ కాస్ట్ తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీఎస్ కాస్ట్ అధికారులు వివరించారు.
భౌగోళిక సూచికాల మేధో సంపత్తి పరమైన హక్కు పత్రాల పరిరక్షణ, కేంద్ర ప్రభుత్వ పరిశోధనల ద్వారా నూతన ఆవిష్కరణలకు సాంకేతికతను సామాజికంగా వినియోగించుకోవడం- రాష్ట్ర సంస్థలు వాటిని అడాప్ట్ చేసుకోవడం, విద్యార్థుల్లో సైన్స్ టెక్నాలజీ పట్ల అవగాహన కల్పించడం, వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం, యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం, విశ్వ విద్యాలయాలతో సమన్వయం వంటి పలు అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..శాస్త్ర, సాంకేతిక రంగాల ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యమని, టెక్నాలజీ లేని ప్రపంచాన్ని ఊహించలేమన్నారు. పాఠశాల స్థాయి నుంచి సైన్స్ బోధనను మెరుగుపర్చేందుకు, మౌలిక వసతుల కల్పన, తదితర అంశాలపై రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలితో సమన్వయం చేసుకుంటూ టీఎస్ కాస్ట్ పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

స్కూల్, కాలేజీ, విశ్వవిద్యాలయ స్థాయిల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ లో ఆశించిన స్థాయిలో నూతన ఆవిష్కరణలు జరగటం లేదని, శాస్త్రవేత్తలు, విద్యాసంస్థలు వ్యవస్థలోని లోపాలను సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పనితీరును సమీక్షించుకొని, నూతన ధోరణులకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలన్నారు.
వ్యవసాయ రంగం, పర్యావరణ, సహజ వనరుల నిర్వహణలో పరిశోధనలు చేసే విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అద్భుతంగా పురోగమిస్తున్న హైదరాబాద్ కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని తెలిపారు. ఐటీ, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సహకారంతో రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక మండలి నూతన ఆవిష్కరణలకు కృషి చేయాలన్నారు.
సమావేశంలో పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ కాస్ట్ మెంబర్ సెక్రటరీ ఎం. నగేష్, కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక శాఖ సైంటిస్ట్ రష్మి, ఉత్తర్‌ప్రదేశ్ శాస్త్ర, సాంకేతిక శాఖ జాయింట్ డైరెక్టర్ రాజేష్ గంగ్వార్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

