స్మితాసబర్వాల్ వ్యాఖ్యలు సరికావు: రమణాచారి
ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న స్మితాసబర్వాల్ దివ్యాంగవర్గాన్ని తకువ చేసేలా సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలు సరికావని ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న స్మితాసబర్వాల్ దివ్యాంగవర్గాన్ని తకువ చేసేలా సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలు సరికావని ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలో దివ్యాంగులు అనేక రంగాల్లో అద్భుతాలు సృష్టించిన ఘటనలున్నాయని, ఒకరు ఎకువ.. మరొకరు తకువన్న భావన సరికాదని చెప్పారు. స్మితా సబర్వాల్ తన మాటలను పునఃసమీక్షించుకోవాలని సూచించారు.
ఇంకా చదవల్సిన వార్తలు
ఆగస్టులో లా అడ్మిషన్లు
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): లా కాలేజీలకు అనుమతుల మంజూరు, గుర్తింపు ప్రక్రియను ఆగస్టు 4లోగా పూర్తి చేస్తామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హైకోర్టుకు నివేదించింది. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం అడ్మిషన్లకు 5 నుంచి కౌన్సెలింగ్ చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. న్యాయశాస్త్ర ప్రవేశాల్లో యూజీసీ నిబంధనలను ఉల్లంఘించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. విచారణను 12కు వాయిదా వేసింది.
‘క్రిమినల్ కేసులుంటే పాస్‌పోర్టును తిరసరించవచ్చు’
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): క్రిమినల్ కేసులున్న వ్యక్తికి ఆ కేసులు తేలేవరకు పాస్‌పోర్టును తిరస్కరించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. క్రిమినల్ కేసులతో సంబంధంలేకుండా ఆ వ్యక్తికి పాస్‌పోర్టును రెన్యూవల్ చేయాలంటూ పాస్‌పోర్టు అథారిటీని ఆదేశించలేమని బుధవారం తేల్చిచెప్పింది. నల్లగొండ జిల్లా మర్రిగూడకు చెందిన అనంతరాజుగౌడ్కు క్రిమినల్ కేసులతో సంబంధం లేకుండా పదేండ్లపాటు పాస్‌పోర్టును రెన్యువల్ చేయాలంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

