తిరుపతి : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత (స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు నవంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.
తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను నవంబరు 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తామని టిటిడి తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి దర్శనం టోకెన్లు, తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని టిటిడి అధికారులు సూచించారు.