‘దోస్త్’ బాటలో ఆరు రాష్ర్టాలు
- ఏపీ, కేరళ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, కర్ణాటక, పంజాబ్‌లలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు

హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం రాష్ట్రం అమలుచేస్తున్న డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ (దోస్త్) విధానం యావత్తు దేశాన్ని ఆకర్షిస్తున్నది. తెలంగాణ బాటలో ఇప్పటికే ఆరు రాష్ర్టాలు నడుస్తున్నాయి. దోస్త్ తరహాలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం 2016 నుంచి దోస్త్‌ను అమలుచేస్తున్నారు. కాకతీయ, మహాత్మాగాంధీ, ఉస్మానియా, పాలమూరు, శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ సీట్లను దోస్త్ ద్వారానే భర్తీచేస్తున్నారు. ప్రైవేటు, అటానమస్, ప్రభుత్వ కాలేజీలు అనే తేడాల్లేకుండా అన్ని కళాశాలలకు దోస్త్ విధానం వర్తింపజేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆన్లైన్ అడ్మిషన్స్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎండీసీ) ప్రవేశపెట్టి అడ్మిషన్లు కల్పిస్తున్నారు. దీనికి పూర్వరంగమంతా తెలంగాణ దోస్త్ నుంచే గ్రహించడం గమనార్హం. పంజాబ్ అధికారులు సైతం దోస్త్‌ను రోల్‌మెడల్‌గా తీసుకొనే ఆన్లైన్ ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఢిల్లీ వర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో సైతం ఇదే తరహా విధానం కొనసాగిస్తున్నారు. కర్ణాటకలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్ ప్రవేశాలను యూజీ ఆన్లైన్ అడ్మిషన్స్ వెబ్సైట్ ద్వారా పూర్తిచేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో సైతం డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ తరహా విధానాన్నే అమలుచేస్తున్నారు. కేరళ, పంజాబ్‌లో కూడా వర్సిటీలవారీగా ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు.
దోస్త్ విశేషాలు..
- ఏటా 3లక్షల మంది రిజిస్ట్రేషన్
- ఆరు యూనివర్సిటీలు
- 988 కాలేజీలు
- 200లకు పైగా యూజీ కోర్సులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- DOST Admissions
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

