సొమ్ము సింగరేణిది.. సోకు సర్కార్‌ది!
సింగరేణిలో వృథా ఖర్చులకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలిన యాజమాన్యం, ప్రభుత్వ ప్రచార ఆర్భాటానికి పెద్దపీట వేస్తూ కార్మికులకు తీవ్రనష్టం చేస్తున్నది.
- సంక్షేమంపై కోత, కాంగ్రెస్ ప్రచారంపై కోట్లు ఖర్చు
- దసరా శుభాకాంక్షల కోసం భట్టి పేరిట కరపత్రాలు
పెద్దపల్లి, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో వృథా ఖర్చులకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలిన యాజమాన్యం, ప్రభుత్వ ప్రచార ఆర్భాటానికి పెద్దపీట వేస్తూ కార్మికులకు తీవ్రనష్టం చేస్తున్నది. ఏటా సింగరేణి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పేరిట కరపత్రాలు ముద్రించడం ఆనవాయితీ. కానీ, ఈ యేడాది డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫొటో తో కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల బార్డర్‌తో సింగరేణి సొమ్ము రూ.లక్షలు ఖర్చు పెట్టి ఆయిల్ ప్రింట్ కరపత్రాలను ముద్రించడం విమర్శలకు తావిస్తున్నది. చెమటను చిందించి లాభాలు కురిపిస్తున్న కార్మికుల సంక్షేమంపై యాజమాన్యం కాస్ట్ కటింగ్ పేరుతో కత్తెర వేస్తూ.. ప్రభుత్వ ప్రచారాల ఆర్భాటానికి మాత్రం కోట్లు ఖర్చు చేస్తున్నది. కార్మికుడికి స్వీట్ ఇవ్వని యాజమాన్యం, కరపత్రాలకు డబ్బెక్కడిదని కార్మికసంఘాలు మండిపడుతున్నాయి.
ఇదేం అన్యాయం?
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం ఆనవాయితీగా వస్తున్నది. కానీ, ఈ యేడాది గతంలో ఎన్నడూ లేని విధంగా డిప్యూటీ సీఎం పేరిట నాలుగు పేజీల కరపత్రాన్ని ముద్రించి పంపింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార మూడేండ్లుగా హామీలు ఇస్తూ దాటవేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మూడు రంగులతో ఆయిల్ పెయింట్‌తో నాలుగు పేజీల కరపత్రాలను పంచడం సింగరేణి సొమ్ముతో సర్కారు సోకులు పడుతున్నట్టుగా ఉన్నది.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజేకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

