Siddipet Steel Bank | మెరిసిన సిద్దిపేట స్టీల్ బ్యాంక్.. ఆర్థిక సర్వేలో ప్రత్యేక ప్రస్తావన
జాతీయ స్థాయిలో మరోసారి సిద్దిపేట పేరు మారుమోగింది. పార్లమెంట్‌కు సమర్పించిన ఆర్థిక సర్వేలో సిద్దిపేట స్టీల్ బ్యాంక్‌కు ప్రత్యేక గుర్తింపు లభించడం ఇందుకు తార్కాణం. ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చే లక్ష్యంతో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు చేసిన వినూత్న ప్రయత్నానికి నేడు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి.
Siddipet Steel Bank | సిద్దిపేట, జూలై 22: జాతీయ స్థాయిలో మరోసారి సిద్దిపేట పేరు మారుమోగింది. పార్లమెంట్‌కు సమర్పించిన ఆర్థిక సర్వేలో సిద్దిపేట స్టీల్ బ్యాంక్‌కు ప్రత్యేక గుర్తింపు లభించడం ఇందుకు తార్కాణం. ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చే లక్ష్యంతో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు చేసిన వినూత్న ప్రయత్నానికి నేడు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. సిద్దిపేట పట్టణంలో ప్లాస్టిక్ నివారించాలనే ఉద్దేశంతో 43 వార్డులకు గాను 34 వార్డుల్లో ప్రత్యేకంగా స్టీల్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఎలాంటి కార్యక్రమాలు జరిగిన ఈ స్టీల్ బ్యాంకులోని పాత్రలను కిరాయికి ఇస్తారు. తద్వారా ప్లాస్టిక్ నియంత్రణ మరింత కట్టుదిట్టంకానున్నది. ఈ స్టీల్ బ్యాంకులను ఆయా వార్డుల్లోవున్న మెప్మా ఆధ్వర్యంలోని స్వయం సహాయక బృందాలు నిర్వహిస్తున్నాయి.
తద్వారా మహిళకు ఉపాధి లభించడంతోపాటు ప్లాస్టిక్ మహమ్మారిని నివారించడానికి మార్గం ఏర్పడినట్లు అయింది. ఇదే స్పూర్తితో సిద్దిపేట జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ స్టీల్ బ్యాంక్‌లను ఏర్పాటు చేయడంతోపాటు జాతీయ స్థాయిలోనూ బర్ధన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసేయోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. కాలుష్య నియంత్రణకు సిద్దిపేట స్టీల్ బ్యాంక్ తీసుకుంటున్న చర్యలు ఎంతో అద్భుతమని కేంద్రం ప్రశంసలు కురిపించింది.
ఒక పని మొదలు పెట్టినప్పుడు అవుతుందో కాదో అని ఆలోచనతో మొదలు పెడతాం. సిద్దిపేట ప్రజల అదృష్టం ఇక్కడ ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతమవుతుంది. తాజాగా పార్లమెంట్‌కు సమర్పించిన ఆర్థిక సర్వేలో సిద్దిపేట స్టీల్ బ్యాంకును ప్రస్తావించడం, జాతీయస్థాయిలో సిద్దిపేట ఖ్యాతి మరోసారి మారుమోగినట్టు అయింది. ప్రజా ప్రతినిధిగా పనిచేయడం ఎంత గొప్పదో దానిని సద్వినియోగం చేసుకోవడం వల్ల వచ్చే ఫలితాలు సంతృప్తిని ఇస్తాయి. ఇక్కడి ప్రజల భాగస్వామ్యం వల్లనే ఇది సాధ్యమైందని, ఇందుకు సహకరించిన అధికారులు, ప్రజలకు అభినందనలు.
-తన్నీరు హరీశ్‌రావు
ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు
- దేశీయ బొమ్మల పరిశ్రమ ఎగుమతులు పెరిగేందుకు చైనా బొమ్మల దిగుమతులపై కఠిన నిబంధనలు, కస్టమ్స్ సుంకాలను పెంచాలి.
- 2030కల్లా భారతీయ ఔషధ పరిశ్రమ పరిమాణం 130 బిలియన్ డాలర్లను తాకాలంటే ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధి, మరిన్ని నూతన ఆవిష్కరణలు అవసరం.
- తయారీ, వస్త్ర పరిశ్రమ, పర్యాటకం, రవాణా రంగాల్లో ఉత్పత్తి, ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహకాలతో నైపుణ్యాభివృద్ధిని అనుసంధానించాలి.
- కృత్రిమ మేధస్సు, రక్షణాత్మక ధోరణులు, సరఫరా ఇబ్బందులతో సేవా, తయారీ రంగాలు ప్రభావితమవుతున్న నేపథ్యంలో దేశీయ పర్యాటక రంగం ద్వారా వస్తున్న ఉద్యోగావకాశాల్ని ఒడిసి పట్టుకోవాలి.
- ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంతో ఆటోమొబైల్, ఆటో విడిభాగాల పరిశ్రమల్లోకి రూ.67,690 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు.
2030కల్లా దేశీయ పునరుత్పాదక శక్తి రంగం 500 మెగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే రూ.30.5 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం. - భౌగోళిక రాజకీయ అనిశ్చితులతో ఏర్పడుతున్న సవాళ్లను అధిగమించాలంటే దేశీయ ఎగుమతిదారులు తమ సేవలను మరిన్ని ఇతర దేశాల్లోకి విస్తరించాలి.
- పట్టణీకరణతో ఇండ్లకు డిమాండ్ పెరుగుతున్నది. తద్వారా దేశీయ నిర్మాణ రంగం ఆశాజనకంగా నడుస్తున్నది. అయితే నిలిచిపోతున్న ప్రాజెక్టులు ఆందోళనకరం.
- పరిశ్రమ రూపురేఖల్ని మార్చడంలో గ్రీన్ స్టీల్‌ది కీలకపాత్ర. కర్బన ఉద్గారాల రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా ప్రపంచం అడుగులు వేసేందుకూ ఇది ప్రధానమే.
- ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌లో పెరుగుతున్న రిటైల్ మదుపరుల భాగస్వామ్యం ఆందోళనకరం. జూద ప్రవృత్తిని పెంచేందుకు దోహదం చేస్తున్న పరిణామాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నది.
- సోషల్ మీడియా, అనారోగ్య ఆహారం వంటి వాటిలో గణనీయంగా పెరుగుతున్న ప్రైవేట్ రంగ పెట్టుబడులు. దీనివల్ల అనేక దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయి.
- భవిష్యత్తులో ఆదాయ అసమానతల్ని ఎదుర్కోవడంలో పన్ను విధానాలే కీలకం. ఉద్యోగ-ఆదాయాలపై ఏఐ వంటి వాటి ప్రభావం ఎక్కువవుతుంది.
- దేశ వాణిజ్య లోటు మున్ముందు మరింత తగ్గుతుంది. ఆయా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతోపాటు దేశీయంగా తయారీ రంగ
బలోపేతానికి అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు కలిసొస్తాయి. - డాటా ప్రైవసీ, పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు.. దేశంలో ఈ-కామర్స్ కార్యకలాపాల వృద్ధికి ప్రధాన అవరోధాలు.
- రవాణా ఖర్చులను తగ్గించడంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ది ప్రధాన పాత్ర.
- ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న ఐఫోన్లలో భారత్ వాటా 14 శాతం. పెరుగుతున్న దేశీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ఎగుమతులు
- గత రెండేండ్లుగా అధిక ఆహార ధరలకు వాతావరణ మార్పులు, రిజర్వాయర్లలో పడిపోయిన నీటి నిల్వలు, పంట నష్టాలే కారణం.
- బియ్యం, గోధుమలు, ఇతరత్రా పప్పు ధాన్యాలు ఫ్యూచర్స్ ట్రేడింగ్ నుంచి తప్పించడం ఉత్తమం. ఆయిల్ సీడ్స్, పత్తి, బాస్మతీ రైస్, సుగంధద్రవ్యాలు ఆమోదమే.
- భారతదేశ వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్ల పాత్ర ప్రధానం.
- ఈ ఏడాది దేశంలోకి మరిన్ని రెమిటెన్స్‌లు. 124 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం.
- ఆర్థిక రంగ ముఖచిత్రం బాగున్నది. అయితే ఒడిదొడుకులపై అప్రమత్తత అవసరం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

