TSLPRB | ఎస్ఐ, ఏఎస్ఐ ప్రిలిమినరీ కీ విడుదల.. రేపటి నుంచి వెబ్సైట్లో..!
TSLPRB | తెలంగాణ స్టేట్ లెవల్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ఇటీవల నిర్వహించిన ఎస్ఐ (సివిల్, ఐటీ అండ్ సీఓ, పీటీఓ) తత్సమాన పోస్టులు, ఏఎస్ఐ (FPB) పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల ఫలితాల ‘కీ’ ని శనివారం నుంచి www.tslprb.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
TSLPRB | హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ లెవల్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ఇటీవల నిర్వహించిన ఎస్ఐ (సివిల్, ఐటీ అండ్ సీఓ, పీటీఓ) తత్సమాన పోస్టులు, ఏఎస్ఐ (FPB) పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల ఫలితాల ‘కీ’ ని శనివారం నుంచి www.tslprb.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8, 9 తేదీల్లో ఆర్థమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లిష్, జనరల్ స్టడీస్, తెలుగు, ఉర్దూ, రెండు నాన్ టెక్నికల్ పేపర్లకు సంబంధించిన పరీక్షలను మూడు జిల్లాల్లో 81 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇందులో ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని 15న ఉదయం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. వీటికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి 17వ తేదీ వరకు వెబ్సైట్ ద్వారా స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను డాక్యుమెంట్, పీడీఎఫ్, జేపీజీ రూపంలో వెబ్సైట్లో సమర్పించవచ్చు. అందుకు సంబంధించిన ప్రొఫార్మాను తమ వ్యక్తిగత లాగిన్‌లో అందుబాటులో ఉంచినట్లు బోర్డు చైర్మన్ పేర్కొన్నారు. ఫైనల్ కీని విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల ఓఎమ్మార్ షీట్‌ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. మిగతా పేపర్లకు సంబంధించిన ప్రిలిమినరీ కీ వివరాలను ప్రెస్‌నోట్ ద్వారా విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

