నేటినుంచి గుట్టలో శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన
- 30 రోజులపాటు నిర్వహణ
యాదాద్రి, జూలై 28 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో శుక్రవారం నుంచి నెల రోజులపాటు నిర్వహించనున్న శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రధానాలయ వెలుపలి ప్రాకార ఈశాన్య మండపంలో విష్వక్సేనారాధన, స్వస్తీవాచనంతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. ప్రధానాలయంలోకి లక్ష్మీ అమ్మవారు ప్రవేశించిన తర్వాత మొదటిసారిగా వస్తున్న శ్రావణమాసంలో జరిగే ఈ వేడుకను అత్యంత వైభవంగా చేపట్టనున్నారు.
భక్తులందరికీ చేరువ కావాలని, అభయం ఇవ్వాలన్న సంకల్పంతో లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో గీత, ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులకు వారి గోత్రనామాల పేరిట సంకల్పం చేస్తారు. మొదటి రోజు పాల్గొనే భక్తులకు శెల్లా, కనుము, కుంకుమ, లడ్డూ ప్రసాదం అందజేస్తామని ఈవో తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

