స్టాఫ్‌నర్స్ సీనియార్టీలో అవకతవకలు నిజమే
స్టాఫ్‌నర్స్ సీనియార్టీ జాబితాలో అవకతవకలు జరిగాయని స్వయంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) కార్యాలయం ఒప్పుకున్నది. కొన్నాళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా నర్సింగ్ ఆఫీసర్లు ఆరోపిస్తున్నదే నిజమని తేలింది.
- ఆఫీస్ బేరర్లు, వైద్య సంస్థల సిబ్బంది కుమ్మకు
- స్వయంగా ఒప్పుకున్న డీపీహెచ్ కార్యాలయం
- 23 దవాఖానాలకు షోకాజ్ నోటీసులు జారీ
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): స్టాఫ్‌నర్స్ సీనియార్టీ జాబితాలో అవకతవకలు జరిగాయని స్వయంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) కార్యాలయం ఒప్పుకున్నది. కొన్నాళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా నర్సింగ్ ఆఫీసర్లు ఆరోపిస్తున్నదే నిజమని తేలింది. వాస్తవ జాబితాను దాచిపెట్టి, తప్పుడు సీనియార్టీ జాబితాను కౌన్సెలింగ్ కోసం తమ కార్యాలయానికి పంపించారని డీపీహెచ్ కార్యాలయం గుర్తించింది. కొందరు నర్సింగ్ ఆఫీసర్లు, గుర్తింపు సంఘాల ఆఫీస్ బేరర్లు, వైద్య సంస్థల సిబ్బంది కుమ్మక్కై కౌన్సెలింగ్‌ను పకదారి పట్టించినట్టు అనుమానిస్తున్నది.
ఈ గందరగోళం వల్లనే కౌన్సెలింగ్ రసాభాసగా మారిందని, నర్సులు రోడ్ల మీదికి రావాల్సి వచ్చిందని, బదిలీల ప్రక్రియను వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తిందని అభిప్రాయపడింది. ఇందుకు కారకులైన వారికి డీపీహెచ్ కార్యాలయం నుంచి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. డీఎంఈ పరిధిలోని 23 దవాఖానలు, నర్సింగ్ కాలేజీల్లో పనిచేసే నర్సింగ్ ఆఫీసర్ డివిజన్ హెచ్వోడీలకు సోమవారం రాత్రి నోటీసులిచ్చారు. సాధారణ బదిలీలకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులను, ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేసినందుకు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
షోకాజ్ నోటీసులు అందుకున్న వారు..
గాంధీ, ఉస్మానియా, ఈఎన్టీ, ఫీవర్, సరోజినీ కంటి దవాఖాన, టీబీ, చెస్ట్ హాస్పిటల్, డీఎంహెచ్ సుల్తాన్ బజా ర్, డెంటల్ కాలేజీ, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్, అనుబంధ నర్సింగ్ కాలేజీలు, వరంగల్‌లోని నర్సింగ్ కాలేజీ, ఎంజీఎం, ఏహెచ్, హన్మకొండలోని కేఎంసీ, జీఎంహెచ్ తది తర దవాఖానల సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

