Telangana | హైదరాబాద్ ప్రజలకు పోలీసుల హెచ్చరిక.. రాత్రి 11 దాటితే తన్నుడే?.. సోషల్‌మీడియాలో వైరల్
రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతిభద్రతలను కట్టడి చేయటానికి ప్రభుత్వం నకిలీ మంత్రాన్ని నమ్ముకున్నట్టు కనిపిస్తున్నది.
- జులాయిగా తిరిగితే కఠిన చర్యలు
- దుకాణాలు బంద్ చేయాల్సిందే
- కాంగ్రెస్ ఎక్స్ ఖాతా నుంచి పోస్ట్
- మండిపడిన బీఆర్ఎస్, ఎంపీ అసద్
- ఆంక్షలు లేవని పోలీసుల వివరణ
- నేరాలను అదుపు చేయటం చేతగాక
- ఇవేం పిచ్చిపనులంటూ నెటిజన్లు ఫైర్
Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతిభద్రతలను కట్టడి చేయటానికి ప్రభుత్వం నకిలీ మంత్రాన్ని నమ్ముకున్నట్టు కనిపిస్తున్నది. దాదాపు పదిహేను రోజుల్లోనే సుమారు పది వరకు హత్యలు, దోపిడీలు రాజధానిలో వెలుగుచూశాయి. దీంతో శాంతి భద్రతల కట్టడికి ఆంక్షలు విధిస్తూ నేరుగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా, రెండు రోజుల కిందట ‘రాత్రి 11లోపే దుకాణాలు మూసివేయాలి. అర్ధరాత్రి తిరిగితే కఠిన చర్యలు తప్పవు. నో ఫ్రెండ్లీ పోలీస్… ఓన్లీ లాఠీచార్జి పోలీస్’ అంటూ పోలీస్ పెట్రోలింగ్ జీపుల్లోని మైకులో వచ్చే ప్రకటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పాతబస్తీలోని ఓ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనంలోని మైకు నుంచి వచ్చిన ఈ ప్రకటన అందరినీ విస్మయానికి గురి చేసింది. ఆదివారం కాంగ్రెస్ ఎక్స్ హ్యాండిల్లోనూ ఇదే విషయాన్ని పోస్ట్ చేశారు. ‘దుకాణాలు రాత్రి 10:30 లేదా 11 గంటల్లోపు మూసివేయాలి. శాంతి భద్రతలకు భంగం కలిగించొద్దు. అర్ధరాత్రి జులాయిగా తిరిగితే కఠిన చర్యలు తప్పవు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దు. రోడ్లపై అల్లర్లు సృష్టించవద్దు. అనుమానాస్పద వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వవద్దు. గంజాయి బ్యాచ్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అంటూ హైదరాబాద్ ప్రజలకు పోలీసు శాఖ హెచ్చరికలు జారీచేసిందని, ముఖ్యమంత్రి ప్రత్యేక ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగనట్టుగా హెచ్చరిస్తూ ట్వీట్ చేసింది.
భగ్గుమన్న బీఆర్ఎస్, ఒవైసీ
కాంగ్రెస్ సర్కారు అనధికారిక ఆదేశాలపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. నేరాలను నియంత్రించటం, నేరస్థులను పట్టుకోవటం ప్రభుత్వానికి చేతకావటం లేదని పార్టీ వర్గాలు ఎద్దేవా చేశాయి. ముఖ్యమంత్రి శాంతిభద్రతలను గాలికొదిలేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటంలో బిజీగా ఉన్నారని పార్టీ నేతలు విమర్శించాయి. పాతబస్తీలో మాత్రమే పోలీసులు మైకులతో ప్రకటనలు చేయటంపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. పోలీసులు జూబ్లీహిల్స్‌లో అలాంటి ప్రకటన చేస్తారా? అని హైదరాబాద్ సిటీ పోలీస్‌కమిషనర్‌కు ట్వీట్ చేశారు. ఇరానీ చాయ్ హోటల్స్, పాన్‌షాపులు, వాణిజ్య సంస్థలు కనీసం 12 గంటల వరకు తెరిచి ఉంచడానికి అనుమతించాలని, నగరమంతా ఒకే విధానాన్ని అమలుచేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా మెట్రోనగరాల్లో రాత్రి సమయంలో దుకాణాలను తెరిచేందుకు అనుమతిస్తారని హైదరాబాద్‌లో ఎందుకు భిన్నంగా ఉండాలని ప్రశ్నించారు. మరోవైపు అనధికారిక ఆదేశాలపై నెటిజన్లు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడేశారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో 24 గంటల పాటు పనిచేసే సంస్కృతి ఐటీ కారిడార్‌లో ఉంది. అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులు ఏ సమయంలోనైనా ఆఫీసు నుంచి ఇండ్లకు వెళ్లే అవకాశం ఉంటుంది. పోలీసుల నిర్ణయాలు వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నదని సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేశారు. రాత్రి 11 గంటలకు ఆఫీస్ అయిపోయాక హోటళ్లు మూసివేస్తే ఎక్కడ తినాలి? ఇది హైదరాబాదా.. పల్లెటూరా? అంటూ ఓ నెటిజన్ సత్యజిత్ ప్రశ్నించారు. విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ట్వీట్‌ను డిలీట్ చేసింది.
నిబంధనల ప్రకారమే మూసివేస్తున్నాం
అనధికారిక సమాచారం వ్యాప్తిలోకి రావటం, పోలీసులపై విమర్శలు వ్యక్తమవటంతో హైదరాబాద్ నగర పోలీసు విభాగం స్పందించింది. నగరంలో గతంలో ఉన్న నిబంధనల మేరకు రాత్రి సమయంలో దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలను మూసివేస్తున్నట్టు వివరణ ఇచ్చింది. 11 గంటలకే దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశించారంటూ సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

