రిజర్వాయర్ పనులు అడ్డుకుంటే బొంద పెడ్తం
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపడుతున్న రిజర్వాయర్ పనులను ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే వారిని చెరువులోనే పాతి బొంద పెడుతామని నారాయణపేట జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డాడు.
- కాంగ్రెస్ నేత శివకుమార్‌రెడ్డి బెదిరింపులు
నారాయణపేట రూరల్, అక్టోబర్ 15 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపడుతున్న రిజర్వాయర్ పనులను ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే వారిని చెరువులోనే పాతి బొంద పెడుతామని నారాయణపేట జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డాడు. గురువారం నారాయణపేట జిల్లా పేరపళ్ల శివారులోని జాయమ్మ చెరువును రిజర్వాయర్‌గా మార్చే పనులకు అదనపు కలెక్టర్ శ్రీను, ఇరిగేషన్ ఎస్ఈ సత్యనారాయణ, సర్పంచ్ ఆంజనేయులుతో కలిసి ఆయన భూమి పూజా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. జాయమ్మ రిజర్వాయర్ ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమని, ఎన్నో ఏండ్ల పోరాటం.. రైతుల త్యాగాల ఫలితంగా నిర్మాణ పనులు ప్రారంభం అవుతున్నాయని తెలిపారు. దివంగత నర్సిరెడ్డి ఆశయ సాధనకు ఈ ప్రాజెక్టు అంకితం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇప్పించే బాధ్యత తనదేనని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

