Elkaturthi | శాంతినగర్ పంచాయతీకి ఒకే ఒక నామినేషన్ .. వార్డు స్థానాలు సైతం ఏకగ్రీవం
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని శాంతినగర్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఒకే ఒక నామినేషన్ దాఖలైంది.
ఎల్కతుర్తి, నవంబర్ 29 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని శాంతినగర్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఒకే ఒక నామినేషన్ దాఖలైంది. ఈ గ్రామంలో 4 వార్డులు ఉండగా, మొత్తం 187 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 86 మంది మహిళలు, 101 మంది పురుషులు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గతంలో లాగానే జనరల్ మహిళకు కేటాయించారు. మొన్నటి వరకు సర్పంచ్‌గా పనిచేసిన బాసాని వేళాంగిణి మేరీ మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు.
అలాగే గ్రామంలో ఉన్న 4 వార్డులకు కూడా ఒకే ఒక నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఈ గ్రామ సర్పంచ్ పాటు వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవమయ్యారు. బీఆర్ఎస్ హయాంలో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన సమయంలో కూడా గ్రామంలోని వార్డు సభ్యులు, సర్పంచ్ సైతం ఏకగ్రీవం అయ్యారు. అప్పుడు, ఇప్పుడు వరుసగా సర్పంచ్ గా వేళాంగిణి మేరీ ఎన్నిక కావడం విశేషం. గ్రామస్తులంతా పోటీ లేకుండా రెండోసారి కూడా పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

