Telangana movement | హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ చరిత్ర, రాష్ట్ర సాధన ఉద్యమం, వివిధ సంఘటనలు, ప్రజల ఆకాంక్షకు సంబంధించిన ఆధారాలు, ఫొటోలను సేకరించాలని ప్రభుత్వం సంకల్పించినట్టు సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ కే అశోక్‌రెడ్డి ప్రకటించారు. అవి ఎవరివద్దనైనా ఉంటే జూలై 5లోగా పంపించాలని కోరారు.
ఈ సమాచారాన్ని స్పెషల్ కమిషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, మాసబ్‌ట్యాంక్, ఏసీ గార్డ్స్ హైదరాబాద్-500028 చిరునామాకు పంపాలని సూచించారు. ఇతర వివరాల కోసం జీ బిమల్దేవ్, అసిస్టెంట్ డైరెక్టర్ (ఫొటో) మొబైల్ నంబర్ 99493 51523ను లేదా adphoto.ts@gmail.com ఈ-మెయిల్ ఐడీని సంప్రదించాలని తెలిపారు.