Micro Greens | మైక్రోగ్రీన్స్.. మహా లాభసాటి
Micro Greens |
- మొక్కల పెంపకంతో స్వయం ఉపాధి
- నగరాల్లో భారీగా పెరుగుతున్న వినియోగం
- కిలో వెయ్యి రూపాయలు పలుకుతున్న ధర

హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తేతెలంగాణ): తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం లభించే వాటిలో మైక్రోగ్రీన్స్ పెంపకం ఒకటి. కరోనా నేపథ్యంలో ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన, శ్రద్ధ పెరిగి ఆహారంలో ప్రొటీ న్లు, ఇతర పోషక విలువలు ఉండేలా జాగ్రత్తవహిస్తుండటంతో మైక్రోగ్రీన్స్ వినియోగం అధికమైంది. దీంతో చాలా మంది తమ ఇండ్లలోనే సొంతంగా మైక్రోగ్రీన్స్ పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. దీన్ని ఉపాధిగా మలుచుకొంటే నెలకు రూ.80 వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. మైక్రోగ్రీన్స్ అంటే బ్రహ్మపదార్థాలేమీ కాదు. మనం నిత్యం వాడుకొనే విత్తనాలు, గింజలు, కూరగాయలు, ఆకుకూరలకు చెందిన మొలకలే. వాటి విత్తనాలను మట్టిలో నాటితే కొద్ది రోజుల్లోనే చిన్న మొక్కలుగా పెరుగుతాయి. ఆ సమయంలో వాటిని సేకరించి, ప్యాకెట్లలో నిల్వచేసి సూపర్ మార్కెట్లతోపాటు పండ్లు, కూరగాయలు అమ్మేవారికి విక్రయిస్తే లాభాల పంటే.
కష్టంలేని పని
మైక్రోగ్రీన్స్ పెంపకానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. చిన్నపాటి ట్రేలు, పూలకుండీలు, వాడిపడేసిన పాల ప్యాకెట్లు, ఇతర వస్తువుల్లో మట్టి, వర్మి కంపోస్టు నింపి విత్తనాలను నాటి కొద్దికొద్దిగా నీరు పోస్తే సరి. దీం తో మొలకలు వచ్చి మొక్కలు పెరుగుతాయి. అవి చిన్న గా ఉండగానే సేకరించాలి. తర్వాత అదే మట్టిలో సేంద్రి య ఎరువులు వేసి మళ్లీ మైక్రోగ్రీన్స్‌ను పెంచవచ్చు. ఇందుకు అవసరమయ్యే ట్రేలు, కుండీలను పెట్టుకునేందుకు కొద్దిపాటి ఖాళీ స్థలం ఉంటే చాలు.
మార్కెట్లో అందుబాటులో ఉండే గోధుమగడ్డి, పొద్దుతిరుగుడు, గుమ్మడి, ముల్లంగి, బీట్రూట్, ఆవాలు, మెంతులు, క్యాబేజీ, జీలకర్ర, వాము, పెసర్ల వంటి పలు రకాల విత్తనాలను మైక్రోగ్రీన్స్‌గా పెంచవచ్చు. వీటిని సేకరించిన తర్వాత ఆకులను తెంపి వాటిని ఆహార పదార్థాలపై చల్లుకుని అలాగే తినేస్తారు. మార్కెట్లో వీటి ధర కిలో రూ.1,000 వరకు పలుకుతున్నది. 10-10 అడుగుల సైజ్ ఉన్న చిన్నగదిలో మైక్రోగ్రీన్స్‌ను పెంచినా నెలకు రూ.80 వేల వరకు ఆదాయం వస్తుంది. గేటెడ్ కమ్యూనిటీలు, ఉద్యోగులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో మైక్రోగ్రీన్స్ వినియోగం అధికంగా ఉంటున్నది.
మైకోగ్రీన్స్ పెంపకం ఇలా..
- విత్తనాలను 3 రోజులపాటు నీటిలో నానబెట్టాలి.
- తర్వాత అవి మొలకెత్తుతాయి. వాటిని మట్టితో నింపిన ట్రేలో నాటాలి.
- మట్టిపై నేరుగా నీటిని పోయకుండా స్ప్రే బాటిల్‌తో చల్లాలి.
- విత్తన రకాన్ని బట్టి 7 నుంచి 17 రోజుల్లోగా మైక్రోగ్రీన్స్ పెరుగుతాయి. వాటిని ప్యాకెట్లలో స్టోర్ చేసి నేరుగా సైప్లె చేయవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

