గాగిళ్లాపూర్‌లో వీరుల శిల్పాలు

- కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధనలో లభ్యం
మద్దూరు, జూన్ 4: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం గాగిళ్లాపూర్‌లో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు జరిపిన పరిశోధనలో 13వ శతాబ్దానికి చెందిన వివిధ శిల్పాలు, తెలుగు లిపి ఆధారాలు లభించాయి. లభ్యమైన శిల్పాల్లో ప్రధానంగా శైవభక్తుల ఆత్మాహుతి శిల్పముంది. ఇద్దరు వీరభక్తులు ఆత్మాహుతికి సిద్ధపడి ఎదురెదురుగా నిలబడి, ఆరోహణం చేయబోయే శూలాలను పట్టుకొని నిల్చున్నారు. ఇటీవల మునిగడపలో శూలారోహణం చేసి ఆత్మసమర్పణ చేసిన వీరభక్తుని శిల్పం బయటపడింది. సిద్దిపేట భోగేశ్వరాలయ ప్రాంగణంలో, బమ్మెరలో ఇలాంటి ఆత్మాహుతి వీరశిలలు కన్పించాయి. గాగిళ్లాపూర్లోని ఈ శిల్పాలు కూడా వీరగల్లులో చేర్చదగిన ఆత్మాహుతి వీరశిలలే. మరోచోట రాతిఫలకం మీద చెక్కిన యుద్ధవీరుడి శిల్పముంది. తలమీద సిగముడి, వీరకాసే, దక్షిణాభిముఖుడైన వీరుడు డాకాలు ముందుంచి రెండు చేతులతో శూలాన్ని పట్టుకొని శత్రువుమీద దాడి చేస్తున్నట్టు చెక్కి ఉన్నది ఈ వీరగల్లు విగ్రహం. ఈ వీరగల్లు మీద లఘు శాసనం ఉన్నది. లిపిని బట్టి ఇది 13వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపిగా ప్రస్ఫుటమవుతుంది. వీరుని వేషభాషలు కూడా కాకతీయుల కాలంనాటివని కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. ఈ లఘు శాసనంలో ‘శ్రీ ప్రలోబదేవి.. గోమటయ’ అని ఉన్నది. వీరగల్లులోని వీరుని పేరు గోమటయ అని తెలుస్తున్నదని కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు సామలేటి మహేశ్, శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆలయ ప్రాంగణంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. రూ.13,200 నగదు స్వాధీనం
Priya Bhavani Shankar | ప్రియుడితో ఏడడుగులు వేసిన ఇరుముడి హీరోయిన్.. క్యూట్ పిక్స్ షేర్ చేసిన ప్రియా భవాని
RTC Bus Pass | బస్‌పాస్ జారీలో గందరగోళం.. ఇష్టానుసారంగా బస్ పాస్‌లు జారీ చేస్తున్న ఆర్టీసీ
Kamal Haasan | టైటిల్ వివాదంలో ‘సండియర్’.. గతంలో విరుమాండి’గా పేరు మార్పు..!
Ramayana Movie | ఆస్కార్ బరిలో ‘రామాయణ’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

