కుట్రలను తిప్పికొట్టాలి
- ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్
- ఓయూలో రౌండ్‌టేబుల్ సమావేశం

ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 29: దళిత బంధు పథకాన్ని అడ్డుకునేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారని, వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. దళిత బంధుపై గురువారం ఉస్మానియావర్సిటీలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం దేశంలో అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. స్వాతం త్య్రం సిద్ధించి 73 వసంతాలు గడుస్తున్నా దళితులు అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్నారు. దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ పథకం, మార్కెట్ కమిటీలలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు తదితర కార్యక్రమాలు అమలుచేస్తున్నారని వివరించారు. దళిత బంధు పథకం ద్వారా ఉపాధి పొందడంతోపాటు చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఓయూజేఏసీ చైర్మన్ డాక్టర్ బండారు వీరబాబు, అధ్యక్షుడు డాక్టర్ మంద సురేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ప్రకాశ్, పెర్క శ్యామ్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గణేశ్, ప్రొఫెసర్ రవినాయక్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, విద్యార్థి నేతలు వల్లమల కృష్ణ, నాగయ్య, అఖిల్, బాలకృష్ణ, ఆవాల హరిబాబు, కాంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

