Satyavathi Rathod | గిరిజనుల ఆరాధ్యుడు కేసీఆర్ : సత్యవతి రాథోడ్
గిరిజనుల ఆరాధ్యుడు కేసీఆర్ అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. బుధవారం ఆమె మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లిలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా జీవో 33 ద్వారా గిరిజనులకు కేసీఆర్ 6 శాతం నుంచి 10 శాతం వరకు రిజర్వేషన్ పెంచి నాలుగేండ్లు పూర్తయిందని అన్నారు. రిజర్వేషన్‌తో గిరిజనుల బిడ్డలు ఉద్యోగాలు, పదోన్నతులు పొందినట్టు చెప్పారు.
డోర్నకల్ , సెప్టెంబర్ 16 : గిరిజనుల ఆరాధ్యుడు కేసీఆర్ అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. బుధవారం ఆమె మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లిలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా జీవో 33 ద్వారా గిరిజనులకు కేసీఆర్ 6 శాతం నుంచి 10 శాతం వరకు రిజర్వేషన్ పెంచి నాలుగేండ్లు పూర్తయిందని అన్నారు. రిజర్వేషన్‌తో గిరిజనుల బిడ్డలు ఉద్యోగాలు, పదోన్నతులు పొందినట్టు చెప్పారు.
నాలుగేండ్ల క్రితం సెప్టెంబర్ 17న కేసీఆర్ రిజర్వేషన్ ప్రకటించారని, అదే నెల 30న అమల్లోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో గిరిజనుల స్థితిగతులు చూసి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే వారికి రిజర్వేషన్లు తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. గిరిజనులు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయాలని పిలుపు నిచ్చారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం గిరిజనులకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. రెండున్నరేండ్లలో గిరిజన సంక్షేమానికి ఒక్క పైసా ఖర్చు చేయలేదని ఆరోపించారు. గిరిజనుల సబ్‌ప్లాన్ నిధులకు కోత పెట్టినట్టు దుయ్యబట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

