తెలంగాణ క్రికెట్లో హరిత విప్లవం.. ప్రతి డాట్‌బాల్, ఫోర్, సిక్సర్‌కు మొకలు నాటేలా ప్రతిపాదనలు
క్రికెట్ మైదానంలో బౌండరీల మోత ప్రకృతికి పండుగ కాబోతున్నది! ఐపీఎల్లో బీసీసీఐ విజయవంతంగా అమలుచేసిన గ్రీన్ డాట్‌బాల్ కాన్సెప్ట్ స్ఫూర్తిగా.. తెలంగాణలో ‘వెరిఫైడ్ గ్రీన్ క్రికెట్" విధానాన్ని తీసుకొనిరావాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ సంచలన ప్రతిపాదన చేశారు.
- ప్రపంచంలోనే తొలి ‘వెరిఫైడ్ గ్రీన్ క్రికెట్’ లీగ్‌గా టీజీ స్పోర్ట్స్
- హెచ్‌సీఏకు ‘జీఐసీ’ లేఖ
- మాజీ ఎంపీ సంతోష్ సూచన
హైదరాబాద్, జూన్ 28 ( నమస్తే తెలంగాణ) : క్రికెట్ మైదానంలో బౌండరీల మోత ప్రకృతికి పండుగ కాబోతున్నది! ఐపీఎల్లో బీసీసీఐ విజయవంతంగా అమలుచేసిన గ్రీన్ డాట్‌బాల్ కాన్సెప్ట్ స్ఫూర్తిగా.. తెలంగాణలో ‘వెరిఫైడ్ గ్రీన్ క్రికెట్” విధానాన్ని తీసుకొనిరావాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ సంచలన ప్రతిపాదన చేశారు. డాట్బాల్సే కాకుండా మ్యాచ్‌లో నమోదయ్యే ప్రతి ఫోర్, సిక్సర్‌కు కూడా మొకలు నాటడమే కాకుండా, వాటికి జీపీఎస్ జియో-ట్యాగింగ్ నిర్వహించి వెయ్యి రోజులపాటు సంరక్షించేలా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఎం జీవన్‌రెడ్డికి ప్రతిపాదన లేఖ పంపారు. ఇటీవల లండన్‌లో జరిగిన ైక్లెమేట్ యాక్షన్ వీక్‌లో ‘ప్లేయింగ్ ఫర్ ది ప్లానెట్’ అనే అంతర్జాతీయ కాన్సెప్ట్‌కు ప్రపంచవ్యాప్త పార్లమెంటేరియన్ల నుంచి వచ్చిన విశేష స్పందన చూసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంతోష్ పేరొన్నారు.
ఏటా లక్షకుపైగా మొకలు!
బీసీసీఐ, టాటా గ్రూప్ సంయుక్తంగా ఐపీఎల్లో డాట్‌బాల్స్‌కు మాత్రమే మొకలు నాటుతున్నాయి. ఇప్పటివరకు ఆ సంఖ్య 6.4 లక్షలకు చేరింది. హెచ్‌సీఏ ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ స్టేట్ ప్రీమియర్ లీగ్ (టీజీ-20), తెలంగాణ గోల్డ్‌కప్ లాంటి ప్రధాన టోర్నీల్లో డాట్బాల్స్కే పరిమితం కాకుండా.. నమోదయ్యే ప్రతి డాట్‌బాల్, ఫోర్, సిక్సర్‌కు సైతం మొకలు నాటాలని సంతోష్‌కుమార్ ప్రతిపాదించారు. ఒక టీ-20 మ్యాచ్ జరిగితే వందలకొద్దీ వెరిఫైడ్ మొకలు నాటే అవకాశం లభిస్తుంది. తెలంగాణలోని 33 జిల్లాల్లో ఏటా లక్షకుపైగా మొకలు నాటి, రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచవచ్చని అంచనావేస్తున్నారు.
జియోట్యాగింగ్‌తో పారదర్శకత
ఈ ప్రాజెక్ట్ కేవలం మొకలు నాటడంతోనే ఆగిపోదు. అఫీషియల్ సోర్ కార్డ్ ఆధారంగా మొకల సంఖ్యను లెకించి, నాటిన ప్రతి మొకకూ జీపీఎస్ కోఆర్డినేట్స్‌తో జియోట్యాగింగ్ చేస్తారు. దీనివల్ల ఎవరైనా ఆ మొక ఎకడున్నదో ఆన్లైన్లో ట్రాక్ చేయవచ్చు. ప్రతి మొక్కనూ కంటికి రెప్పలా వెయ్యి రోజులపాటు కాపాడే పూర్తి బాధ్యతను ఈ ప్రాజెక్ట్ కింద తీసుకోనున్నారు. గత దశాబ్ద కాలంలో తెలంగాణలో చేపట్టిన పర్యావరణ కార్యక్రమాల వల్ల రాష్ట్ర అటవీ విస్తీర్ణం 21% నుంచి 28 శాతానికి పెరిగింది. ఇప్పుడు ఈ గ్రీన్ క్రికెట్ ద్వారా క్రీడలను కూడా పర్యావరణ పరిరక్షణ ఉద్యమంతో అనుసంధానించనట్టవుతుంది.
ప్రపంచంలోనే తొలిసారి
ప్రపంచంలోనే క్రికెట్‌ను పర్యావరణంతో అనుసంధానం చేస్తూ ఇలాంటి జియోట్యాగ్డ్ ైక్లెమేట్ యాక్షన్ చేపట్టడం ఇదే తొలిసారి కాబోతున్నది. ఈ చారిత్రాత్మక భాగస్వామ్యం కోసం త్వరలోనే హెచ్‌సీఏ, గ్రీన్ ఇండియా చాలెంజ్ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని సంతోష్‌కుమార్ కోరారు. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే, తెలంగాణ యువ క్రికెటర్లు క్రీడాకారులుగానే కాకుండా, గ్లోబల్ వేదికపై పర్యావరణ పరిరక్షకులుగా గుర్తింపు సాధిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

