హెదరాబాద్లో సనోఫీ హబ్
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఔషధ, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల కంపెనీ సనోఫీ తెలంగాణలో గ్లోబల్ మెడికల్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో ప్రస్తుతం 350 మందికి ఉపాధి కల్పించి, భవిష్యత్తులో మరింత విస్తరించనున్నట్టు తెలిపింది.
- 350 మందికి ప్రత్యక్ష ఉపాధి
- కేటీఆర్‌తో భేటీ తర్వాత ప్రకటన
- ప్రపంచ టాప్-10లో నాలుగు ఇక్కడే
- సనోఫీ రాకతో హైదరాబాద్‌కు మరింత ప్రాధాన్యం
- ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ): ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఔషధ, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల కంపెనీ సనోఫీ తెలంగాణలో గ్లోబల్ మెడికల్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో ప్రస్తుతం 350 మందికి ఉపాధి కల్పించి, భవిష్యత్తులో మరింత విస్తరించనున్నట్టు తెలిపింది. బయోఏషియా-2023 సదస్సులో భాగంగా శనివారం సనోఫీ ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ సైట్స్ హెడ్ మాథ్యూ చెరియన్తోపాటు సంస్థ ప్రతినిధులు హెచ్ఐసీసీలో మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అనంతరం రాష్ట్రంలో గ్లోబల్ మెడికల్ హబ్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆవిష్కరణలు, పరిశోధన-అభివృద్ధిలో తెలంగాణ రాష్ర్టాన్ని ప్రధాన కేంద్రంగా మలచాలన్న ప్రభుత్వ ఆకాంక్షలకు సనోఫీ కట్టుబడి ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడం, భాగస్వామ్యం చేసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న సామర్థ్యానికి సనోఫీ రాక నిదర్శనంగా చెప్పవచ్చు.
టాప్-10లో నాలుగు ఇక్కడే
సనోఫీ తమ గ్లోబల్ మెడికల్ హబ్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడం సంతోషంగా ఉన్నదని మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రభుత్వం లైఫ్‌సైన్సెస్ రంగం అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని, ప్రభుత్వ సహకారంతో ఇక్కడ అద్భుతమైన వ్యాపార వాతావరణం ఏర్పడిందని తెలిపారు. సనోఫీ రాకతో ప్రపంచంలోని టాప్-10 ఔషధ కంపెనీల్లో నాలుగు హైదరాబాద్‌లో కొలువుదీరినట్టు అయ్యిందని పేర్కొన్నారు.
భవిష్యత్తులో మరింత విస్తరణ: మాథ్యూ
హైదరాబాద్‌లో ఏర్పాటుచేయనున్న మెడికల్ హబ్ తమకు ఎంతో కీలకమని, భవిష్యత్తులో మరింత విస్తరించటంతోపాటు కొత్త కంపెనీల స్థాపనకు దోహదపడుతుందని సనోఫీ ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ సైట్స్ హెడ్ మాథ్యూ చెరియన్ తెలిపారు. తమ గ్లోబల్ మెడికల్ హబ్ ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆవిష్కరణలు, పరిశోధన-అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని చెప్పారు. జీవశాస్ర్తాలకు మద్దతిచ్చే అత్యుత్తమ వ్యాపార వాతావరణం, పెట్టుబడుల ఆకర్షించే నైపుణ్యాలు తెలంగాణలో ఉన్నందునే తాము పెట్టుబడులు పెడుతున్నట్టు వెల్లడించారు.
అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్న సనోఫీ
సైన్స్ ద్వారా ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు కృషిచేస్తున్న సంస్థ సనోఫీ. సంస్థ బృందం 100 కంటే ఎక్కువ దేశాల్లో వైద్యవిధానాల్లో అసాధ్యాలను సుసాధ్యం చేసేందుకు కృషిచేస్తున్నది. దాదాపు ఏడు దశాబ్ధాలుగా ప్రపంచవ్యాప్తంగా తమ సేవల ద్వారా రోగులు, భాగస్వాముల విశ్వాసాన్ని పొందింది. హైదరాబాద్‌లో ఇప్పటికే అమెజాన్, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ (మెటా) వంటి ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీల అతిపెద్ద డెవలప్మెంట్ సెంటర్లకు నిలయంగా గుర్తింపు తెచ్చుకొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

