సంగారెడ్డి, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి కలెక్టరేట్‌కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. సంగారెడ్డిలోని సమీకృత కలెక్టరేట్‌కు ఐఎస్వో 9001:2015 సర్టిఫికెట్, ఐఎస్వో 14001 సర్టిఫికెట్లకు ఎంపికైంది. గుడ్ గవర్నెన్స్ విషయంలో క్వాలిటీ మేనేజ్మెంట్ స్టాండర్స్ ఐఎస్వో 9001: 2015 సర్టిఫికెట్‌కు ఎంపికైంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఐఎస్వో 14001 సర్టిఫికెట్ జారీ చేస్తారు. త్వరలోనే ఐఎస్వో సంస్థ 9001, 14001 సర్టిఫికెట్లను జారీ చేయనున్నది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అన్ని ప్రభుత్వ శాఖలకు ఒకేచోట కార్యాలయాలు ఉండేలా, సువిశాల స్థలంలో రెండు అంతస్తులతో సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను నిర్మించారు.