60 లక్షల మంది రైతులకు రైతుబంధు: మంత్రి కేటీఆర్
రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటివరకు రూ.65 వేల కోట్ల రైతుబంధు సాయం అందించామని చెప్పారు.
నిజామాబాద్: రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటివరకు రూ.65 వేల కోట్ల రైతుబంధు సాయం అందించామని చెప్పారు. నిజామాబాద్ పట్టణంలో కాకతీయ స్యాండ్ బాక్స్ ఆధ్వర్యంలో జరిగిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఎనిమిదేండ్లలో 46 వేల చెరువులను పునరుద్ధరించామన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని అతితక్కువ సమయంలో నిర్మించామన్నారు. 45 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందుతున్నదని చెప్పారు.
2014లో తెలంగాణలో 68 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే పండిందని, 2022 నాటికి 3.5 కోట్ల టన్నులు పండించే స్థాయికి చేరుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో నష్టాల్లో ఉన్న విజయ డెయిరీ లాభాల బాటపట్టిందని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు నిత్యం ఆదాయం సమకూరుతుందని చెప్పారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తరణ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకునడుస్తున్నదని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

