వైరా సభలో ప్రజాధనం దుబారా
తెలంగాణ అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాధనాన్ని అడ్డగోలుగా దుబారా చేస్తున్నారు. ఈ విషయం తాజాగా మరోసారి బట్టబయలైంది.
- సీఎం రేవంత్ సభ ఖర్చు రూ.5.07 కోట్లు
- ఏఎల్కేఆర్ కంపెనీకి చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం
- సమాచారహక్కు చట్టం ద్వారా వెలుగులోకి
- ముఖ్యమంత్రి సభలపై విచారణ జరుపాలని సామాజిక కార్యకర్త కారుపోతుల డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాధనాన్ని అడ్డగోలుగా దుబారా చేస్తున్నారు. ఈ విషయం తాజాగా మరోసారి బట్టబయలైంది. రైతులకు మూడో విడుత రుణమాఫీ, సీతారామ ప్రాజెక్టు పనుల ప్రారంభం కోసం 2024 ఆగస్టు 15న ఖమ్మం జిల్లా వైరాలో ఆయన నిర్వహించిన బహిరంగ సభకు ఏకంగా రూ.5.07 కోట్లకుపైగా ఖర్చయినట్టు తేలింది. సమాచార హక్కు చట్టం ద్వారా న్యాయవాది, సామాజిక కార్యకర్త కారుపోతుల రేవంత్ అడిగిన ప్రశ్నకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ సమాధానమిచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను రేవంత్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభలో వేదిక (స్టేజ్ డయాస్), జాక్ సిస్టమ్‌తో చెక ఫ్లోరింగ్, సింథటిక్ కార్పెట్లు, కుర్చీలు, వీఐపీ ఫర్నిచర్, విద్యుద్దీకరణ, లైటింగ్, ఎల్ఈడీ స్రీన్లు, హైటెక్ సౌండ్ సిస్టమ్, హెలిప్యాడ్, సభా ప్రాంగణంలో బారికేడింగ్, ప్రదర్శన స్టాళ్ల ఏర్పాటు తదితర ఖర్చులన్నీ కలిపి రూ.5,07,42,454 ప్రజాధనం ఖర్చయిందని, ఆ ఏర్పాట్లు చేసిన ఏఎల్కేఆర్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఈ ఏడాది ఆగస్టు 29న ఈ మొత్తాన్ని చెల్లించామని అధికారులు లిఖితపూర్వకంగా వెల్లడించారని రేవంత్ తెలిపారు.
పథకాలకు నిధులు పెండింగ్
సీతారామ ప్రాజెక్టును 2026 ఆగస్టు 15 నాటికి పూర్తిచేస్తామని వైరా సభలో సీఎం రేవంత్ ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి రూ.8,591.62 కోట్ల మేరకు ఉన్నట్టు ప్రభుత్వమే అసెంబ్లీలో వెల్లడించింది. ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.2 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నట్టు యజమానులు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో సభకు రూ.5 కోట్లు ఖర్చు చేయడంపై సర్కార్ సమాధానం చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సీఎం సభలపై విచారణ జరుపాలి..
వైరా సభతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్న అన్ని సభలకు ప్రభుత్వం చేసిన ఖర్చులపై సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్‌తోపాటు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు కారుపోతుల రేవంత్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఖర్చుల్లో పారదర్శకతను పెంపొందించేందుకు, ప్రజాధనాన్ని కాపాడేందుకు న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా తన పోరాటం కొనసాగిస్తానని రేవంత్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

