దసరా స్పెషల్ బస్సుల్లోనే చార్జీల సవరణ
టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదని, దసరా స్పెషల్ సర్వీసుల్లోనే చార్జీల సవరణ చేపట్టామని టీజీఎస్ ఆర్టీసీ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
- టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదు: ఆర్టీసీ
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదని, దసరా స్పెషల్ సర్వీసుల్లోనే చార్జీల సవరణ చేపట్టామని టీజీఎస్ ఆర్టీసీ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. స్పెషల్ బస్సుల్లో మాత్రమే సాధారణ చార్జీలో 50 శాతం వరకు సవరణ అమల్లో ఉంటుందని తెలిపింది. ఆర్టీసీలో 2003 నుంచి ఈ పద్ధతి ఆనవాయితీగా వస్తున్నదని పేర్కొంది. ఇప్పుడే కొత్తగా చార్జీల సవరణ చేస్తున్నట్టు కొందరు దుష్ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికింది. ప్రధాన పండుగలైన సంక్రాంతి, దసరా, రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, ఉగాది తదితర సమయాల్లో హైదరాబాద్ నుంచి ప్రయాణికులు ఎకువగా సొంతూళ్లకు వెళ్తుంటారని, రద్దీ మేరకు హైదరాబాద్ సిటీ బస్సులను కూడా జిల్లాలకు తిప్పుతున్నామని తెలిపింది. ఈ నెల 20 నుంచి నడిచే స్పెషల్ బస్సుల్లోనే చార్జీల సవరణ చేయనున్నామని తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

