Rental bus | రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదు.. యధావిధిగా అద్దె బస్సులు నడుస్తాయి : ఆర్టీసీ ఎండీ సజ్జనార్
Rental bus | అద్దె బస్సు(Rental bus) ఓనర్లతో చర్చలు(Negotiations) సఫలం అయ్యాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జ నార్(RTC MD Sajjanar) తెలిపారు.
హైదరాబాద్ : అద్దె బస్సు(Rental bus) ఓనర్లతో చర్చలు(Negotiations) సఫలం అయ్యాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జ నార్(RTC MD Sajjanar) తెలిపారు. గురువారం బస్ భవన్లో అద్దె బస్సు ఓనర్లతో ముగిసిన సమావేశం అనంతరం ఆయన వివరాలను వెల్లడించారు. ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లతో సమావేశంలో పలు అంశాలు చర్చించామని పేర్కొన్నారు. వారు కొన్ని సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చారు. వారం రోజుల్లో అద్దె బస్సు ఓనర్ల సమస్యలు పరిష్కారించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకు గాను సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేస్తామని తెలిపారు.
రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదని, యధావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని స్పష్టం చేశారు. సంక్రాంతికి కూడా ఫ్రీబస్ సర్వీస్ ఉంటుందని అలాగే సంక్రాంతికి స్పెషల్ బస్సులను కూడా నడుపుతామని సజ్జనార్ పేర్కొన్నారు. కాగా, అంతకుముందు అద్దె బస్సు ఓనర్ల సంఘం నేతలు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రేపటి నుంచి బస్సులు నడుపమని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

