Gold Trading | గోల్డ్ ట్రేడింగ్ పేరుతో 150 కోట్లు స్వాహా.. 500 మందికి టోపీ
బంగారం ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి దాదాపు 500 మంది నుంచి రూ.150 కోట్ల వరకు వసూలు చేసి బిచాణా ఎత్తేసిన నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
- నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
- న్యాయం కోసం బాధితుల ఆందోళన
Gold Trading | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): బంగారం ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి దాదాపు 500 మంది నుంచి రూ.150 కోట్ల వరకు వసూలు చేసి బిచాణా ఎత్తేసిన నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ విషయం తెలియగానే బాధితులు ఆదివారం సీసీఎస్ వద్దకు వచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకకు చెందిన రాజేశ్ అనే వ్యక్తి హబ్సిగూడలో ప్రహానేశ్వరీ గోల్డ్ ట్రేడింగ్ కార్యాలయాన్ని ప్రారంభించాడు. బంగారం ట్రేడింగ్‌లో పెడితే వారానికి 2% చొప్పున నెలకు 8% లాభాన్ని ఇస్తానంటూ ప్రచారం చేయడంతో చాల మంది పెట్టుబడులు పెట్టారు.
ఈ క్రమంలో మొదటి రెండు నెలలు చెప్పినట్టుగానే పెట్టుబడిదారులకు లాభాలు ఇవ్వడంతో ఆ నోట, ఈ నోట మరింత ప్రచారం జరిగింది. దీంతో చాలా మంది పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత నెమ్మదిగా లాభాలు ఇవ్వడం మానేసిన రాజేశ్.. మార్కెట్ బాగోలేదంటూ కాలయాపన చేసి ఇటీవల బిచాణా ఎత్తేశాడు. దీనిపై బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో రాజేశ్ ఇటీవల బాధితులకు ఫోన్‌చేసి.. గోల్డ్ ట్రేడింగ్‌లో మరికొంత పెట్టుబడి పెడితే సొమ్మంతా రికవరీ చేస్తానని, పాత లాభాలతోపాటు కొత్త లాభాలను కలిపి ఇచ్చేస్తానని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ సమాచారాన్ని బాధితులు పోలీసులకు చేరవేశారు. దీంతో రాజేశ్ కర్ణాటకలోని ఉడిపిలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆదివారం ఆయనను అరెస్ట్ చేసి, కోర్టుకు తీసుకెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న బాధితులు సీసీఎస్ వద్దకు తరలివచ్చి, తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CCS
- fraud
- gold
- Gold Trading
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

