Bhupalpally | పోలీసు స్టేషన్లో రౌడీ షీటర్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఎస్ఐకి మెమో జారీ..!
Bhupalpally | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోగుళ్లపల్లి పోలీసు స్టేషన్లో ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించాడు. అనేక హత్యా కేసుల్లో నిందితుడైన రౌడీషీటర్ పుట్టిన రోజు వేడుకలను ఎస్ఐ నిర్వహించాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా, మంగళవారం వెలుగు చూసింది.
Bhupalpally | భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోగుళ్లపల్లి పోలీసు స్టేషన్లో ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించాడు. అనేక హత్యా కేసుల్లో నిందితుడైన రౌడీషీటర్ పుట్టిన రోజు వేడుకలను ఎస్ఐ నిర్వహించాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా, మంగళవారం వెలుగు చూసింది. రౌడీషీటర్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
మోగుళ్లపల్లి పోలీసు స్టేషన్ ఎస్ఐ టీ మాధవ్ గౌడ్.. వీ మహేందర్ గౌడ్ అనే రౌడీషీటర్ బర్త్‌డే వేడుకలను ఆదివారం రాత్రి నిర్వహించారు. జిల్లా పరిధిలోని అనేక పోలీసు స్టేషన్లలో మహేందర్ గౌడ్ పేరు మీద రౌడీషీట్ ఓపెన్ చేయబడింది. పోలీసు స్టేషన్లలోని నోటీసు బోర్డుల్లో కూడా మహేందర్ ఫొటోను ఉంచారు. రౌడీషీటర్ ఆగడాలు తెలిసినప్పటికీ.. ఎస్ఐ మాధవ్ బర్త్ డే వేడుకలు నిర్వహించడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై భూపాలపల్లి డీఎస్పీ ఏ సంపత్ రావు స్పందించారు. ఎస్ఐ మాధవ్‌కు మెమో కూడా జారీ చేసినట్లు పేర్కొన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

