వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి : మంత్రి ఎర్రబెల్లి
మంత్రి ఎర్రబెల్లి | ఇటీవలి భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బ తిన్న పంచాయతీరాజ్ శాఖ రోడ్ల నష్టాలను వెంటనే అంచనా వేయాలి. రెండు, మూడు రోజుల్లోనే తనకు నివేదికలు పంపించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.

వరంగల్ : ఇటీవలి భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బ తిన్న పంచాయతీరాజ్ శాఖ రోడ్ల నష్టాలను వెంటనే అంచనా వేయాలి. రెండు, మూడు రోజుల్లోనే తనకు నివేదికలు పంపించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఆయా రోడ్ల మరమ్మతులను త్వరిత గతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపట్టిన సీసీ రోడ్లు, ఉపాధి హామీ పథకం రోడ్లు, పీఎంజీఎస్వై రోడ్లు ప్రగతి వంటి పలు అంశాల పై వరంగల్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయం, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సంబంధిత ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటీవలి భారీ వర్షాలకు కొన్ని చోట్ల రోడ్లు తెగిపోయాయి. మరికొన్ని చోట్ల గతుకుల మయం అయ్యాయి. ఇంకొన్ని చోట్ల వరదలకు రోడ్లు కోసుకుపోయాయి. అలా వర్షాలకు నష్టం జరిగిన పీఆర్ రోడ్ల వివరాలు, నష్టం అంచనాలు, వాటి మరమ్మతులకు ప్రతిపాదనలతో రెండు, మూడు రోజుల్లో అధికారులు మళ్లీ సమావేశం కావాలని మంత్రి అదేశించారు.
వాటి మరమ్మతులు వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చర్యలు తీసుకోవాలని పీఆర్ శాఖ ఇంజినీరింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో మంత్రితోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీ రాజ్ శాఖ ఎస్ఈ జోగా రెడ్డి, డీఈఈ శంకరయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పరువు నష్టం కేసులో నటి కంగనాకు చుక్కెదురు
Nizamabad : పైకి తేలిన అంతరాష్ట్ర రహదారి
నేషనల్ హైవేపై దిగిన సుఖోయ్, జాగ్వార్ యుద్ధ విమానాలు.. వీడియో
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

