పరువు నష్టం కేసులో నటి కంగనాకు చుక్కెదురు

ముంబై : బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు ముంబై హైకోర్టులో చుక్కెదురైంది. గేయ రచయిత జావెద్ అక్తర్ వేసిన పరువు నష్టం కేసులో పిటిషన్‌ను కొట్టి వేయాలని కంగనా కోరినా.. ఆమె అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. హైకోర్టు జడ్జి జస్టిస్ రేవతి మోహితే దేరే ఈ కేసులో విచారణ చేపట్టారు. సెప్టెంబర్ ఒకటిన తన ఆదేశాలను రిజర్వ్‌లో ఉంచారు. అయితే ఆ కేసులో కంగనా పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ఇవాళ జస్టిస్ రేవతి తెలిపారు. అంధేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు కంగనాపై పరువు నష్టం కేసు విచారణ మొదలుపెట్టింది. ఆ కేసును కంగనా సవాల్ చేసింది. ఆమె తరపు రిజ్వాన్ సిద్ధికీ వాదించారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జావెద్ అక్తర్‌పై నటి కంగనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటనలో జావెద్ అక్తర్ .. క్రిమినల్ ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో విచారణ ప్రారంభించిన జూహూ పోలీసులు ఫిబ్రవరిలో ఆమెకు సమన్లు జారీ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

